సినిమా బాగున్నా యావరేజ్, ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న ఎన్టీఆర్ సినిమాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.ఏ సినిమాలో నటించినా తన నటనతో తారక్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

 Reasons Behind Young Tiger Junior Ntr Movies Failure Details Here , Junior Ntr-TeluguStop.com

అయితే తారక్ కెరీర్ లో కూడా ఫ్లాప్, యావరేజ్ సినిమాలు ఉన్నాయి.అయితే తారక్ నటించిన కొన్ని సినిమాలు మాత్రం ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తమకు అర్థం కావడం లేదని స్వయంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతుండటం గమనార్హం.

ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో అల్లరి రాముడు ఒకటి.ఈ సినిమా తారక్ అభిమానులకు తెగ నచ్చేయడంతో పాటు నిర్మాతకు కళ్లు చెదిరే లాభాలను అందించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమా కూడా సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Telugu Ntr, Failure, Young Tiger, Youngtiger-Movie

వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తారక్ నటించిన సాంబ సినిమాలో చదువు గురించి ఎంతో గొప్పగా చెప్పారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా సినిమాలలో ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ఆశించిన విధంగా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.ఈ సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి.

Telugu Ntr, Failure, Young Tiger, Youngtiger-Movie

కొన్నిసార్లు రిలీజ్ డేట్లు మారడం వల్ల కొన్నిసార్లు ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.మరికొన్ని సందర్భాల్లో ఈ సినిమాకు పోటీగా వేరే సినిమాలు రిలీజ్ కావడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో తారక్ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube