సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు అవకాశాలు దక్కాలంటే ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి.ఎవరో కొంతమంది మాత్రమే ఒకేసారి నాలుగైదు సినిమాలు లేదా మూడు సినిమాలు చేస్తూ బిజీగా తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు.ఆ అవకాశం అందరికీ దక్కే ఛాన్స్ లేదు కానీ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలతో ఇండస్ట్రీలోకి రాబోతున్న ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
దేవి శ్రీ ప్రసాద్
2022 మొదటి అర్ధ భాగంలో ఏకంగా ఐదు సినిమాలతో సందడి చేశాడు ఇక రెండవ భాగంలో ది వారియర్ సినిమాతో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించగా సెప్టెంబర్ లో రంగా రంగా వైభవంగా అనే సినిమా చేస్తూ మరోసారి అభిమానులను అలరించబోతున్నాడు.
తమన్

మొదటి అర్ధ భాగంలో అరడజనులకు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ సెకండాఫ్ లో ఏకంగా నాలుగు ఆసక్తికరమైన సినిమాలతో సందడి చేయబోతున్నాడు.గాడ్ ఫాదర్, థాంక్యూ, ప్రిన్స్, బాలకృష్ణ 107 సినిమాతో అలరించబోతున్నాడు.
రాశి ఖన్నా

ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమాతో రెండవ అర్థభాగంలో తన హవా రాశి కన్నా థాంక్యూ సినిమా లో మరోసారి సందడి చేయనుంది.ఇక దీపావళికి సర్దార్ సినిమాతో రానుండగా అలాగే హిందీ సినిమా యోధాతో కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సమంత

2022 ప్రథమ అర్థ భాగంలో కే ఆర్ కే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత, సెకండ్ హాఫ్ లో మాత్రం యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై తన హవా కొనసాగించరుంది.
నిఖిల్

అర్జున్ సురవరం అనే సినిమాతో చివరగా మూడేళ్ల క్రితం సినిమాతో థియేటర్లోకి వచ్చిన నిఖిల్, 2022 సెకండ్ హాఫ్ లో మాత్రం కార్తికేయ 2, 18 పేజెస్, స్పై సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
విజయ్ దేవరకొండ

రెండేళ్ల క్రితం విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ తో చివరిసారిగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలతో ఈ ఏడాదిని పూర్తి చేయనున్నాడు అవే లైగర్ మరియు ఖుషి.
నాగ చైతన్య

2022 మొదటి అర్థం లో బంగార్రాజు సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య రెండవ అర్థ భాగానికి వచ్చేసరికి థాంక్యూ, లాల్ సింగ్ చద్దాతో అభిమానులకు వినోదాన్ని పంచనున్నాడు.
రవితేజ

2022లో ఖిలాడీతో ఈ ఏడాదిని మొదలుపెట్టిన రవితేజ మరో మూడు సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నాడు.రావణాసుర, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతో ఈ ఏడాది ముగిస్తున్నాడు.
నాగార్జున

మొదటి అర్డబాగం లో కేవలం ఒకే సినిమా బంగార్రాజు తో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన నాగ్, ది ఘోస్ట్, బ్రహ్మాస్త్ర, పార్ట్ వన్ శివ తో మరోమారు థియేటర్లలో కనువిందు చేయనున్నాడు.







