అద్దంలో చూసుకొని బాధ పడేవాడిని.. ఆ లుక్స్ గురించి ప్రభుదేవా ఆవేదన?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయినా ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.డాన్సులో తనను ఎవరు కూడా బీట్ చేయలేని అంతగా ఇమేజ్ ను సంపాదించుకున్నారు ప్రభుదేవా.

 Prabhu Deva About His Look In My Dear Bootham Movie , Prabhudeva , My Dear Booth-TeluguStop.com

అంతేకాకుండా ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే యాక్టర్ గా సినిమాలు కూడా చేశారు.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభుదేవా తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ.ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మై డియర్ భూతం.

ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో నేడు అనగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో ప్రభుదేవా ఒక భూతం పాత్రలో నటించారు.

అలా అలా భూతం పాత్రలో నటించడానికి ఆయన ఎంతో కష్టపడ్డారట.ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి మాట్లాడుతూ.

మై డియర్ భూతం సినిమాలో భూతం పాత్ర ఎలా ఉండాలనే దానిపై నాకు నేనుగా ఆలోచించి లుక్ ను డిఫరెంట్ గా ట్రై చేశాను.అయితే ఆ భూతం డ్రెస్సులో ఫ్రీగా కనీసం ఒంగలేను చెవుల లుక్ కూడా మార్చేస్తాను.

మేకప్ చేసుకోకుండా గుండు కొట్టించుకున్నాను.కేవలం తల పైన పిలకను మాత్రం ఉంచుకున్నాను అని తెలిపారు ప్రభుదేవా.

Telugu Ghost Character, Dear Bootham, Prabhudeva, Tollywood-Movie

ఇక ఆ సినిమా కోసం పెట్టుకున్న పిలక లుక్ ను మార్చలేం కాబట్టి సినిమాను సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయాలని కోరాను.అలా నాకు సంబంధించిన సన్నివేశాలను 45 రోజుల్లో చిత్రీకరించారు అని చెప్పుకొచ్చారు ప్రభుదేవా.అయితే ప్రతిరోజు మేకప్ వేసుకునే సమయంలో ఇదేంటి ఇలా అయిపోయాను అనుకునేవాడిని అలా కొన్ని రోజులపాటు బయటకు రావడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది.కానీ సినిమా కోసం తప్పలేదు అని తెలిపారు ప్రభుదేవా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube