రాజకీయాలు ఎక్కడ జరుగుతున్నా ఎంతో రసవత్తరంగా ఉంటుంది.ముఖ్యంగా అన్నిటికంటే అమెరికా రాజకీయాలు అక్కడి అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచ మొత్తం కళ్ళార్పకుండా చూస్తుంది.
అయితే ప్రస్తుతం అమెరికా రాజకీయ ఎన్నికలను మించి ఇప్పుడు బ్రిటన్ లో జరుగుతున్న రాజకీయ రచ్చపై సర్వత్రా నరాలు తెగే ఉత్ఖంట రేగుతోంది.అందుకు ప్రధాన కారణం భారత సంతతి మూలాలు ఉన్న వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణ్ మూర్తి అల్లుడు , బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా సేవలు అందించిన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని రేసులో ఉండటమే అందుకు కారణం.
బ్రిటన్ ప్రధానిగా ఎవరు నిలబడాలి అనే కోణంలో ప్రస్తుతం జరుగుతున్న పోరులో రిషి సునక్ అందరిని నెట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారని తెలుస్తోంది.నిన్నటి రోజున జరిగిన తొలి రౌండ్ లో రిషి సునక్ సుమారు 88 మంది పార్టీ ఎంపీల ఓట్లతో అత్యధిక ఆధిక్యాన్ని ప్రదర్శించగా, రిషి సునక్ కు ప్రాధాన్ పోటీ దారుగా ఉన్న స్థానిక మహిళ పెన్నీ 67 ఓట్ల తో రిషికి గట్టి పోటీ ఇస్తున్నారు.
వీరితో పాటు పోటీ పడుతున్న మిగిలిన అభ్యర్ధులు లిజ్ ట్రస్ 50 ఓట్లు గెలుచుకోగా, బదేనోక్ 40 ఓట్లు, భారత సంతతికే చెందిన మరో వ్యక్తి అటార్నీ జనరల్ 32 ఓట్లు గెలుచుకున్నారు.ఇదిలాఉంటే
కనీసం 30 మంది ఏపీల మద్దతు కూడా కూడగట్టుకోలేక నదీం జహావి, జేరేమి హంట్ పోటీ నుంచీ వైదొలగారు.ప్రస్తుతం ఆరుగురు అభ్యర్ధులతో పోటీ రసవత్తరంగా సాగుతోంది.రిషితో పాటు పెన్నీ కి కూడా మద్దతు పెరుగుతున్న నేపధ్యంలో అధ్యక్ష పీటం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్ఖంట పెరుగుతోంది.
కాగా ఈ ఆరుగురిలో చివరికి రిషి, పెన్నీ ఇద్దరు మాత్రమే తుది బరిలో ఉంటారని, వీరు 2 లక్షల మంది ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యులలో అత్యధిక మంది మద్దతు గెలుచుకున్న వారే ప్రధాని అభ్యర్ధిగా ఎన్నికవుతారని తెలుస్తోంది.రిషి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే చరిత్ర సృష్టించినట్టే.







