‘మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు’ అని ఏ మహానుభావుడు అన్నాడో గాని వానికో నమస్కారం చేయాలి.ఎందుకంటే ఇక్కడ నువ్వు కష్టాల్లో వున్నపుడు ఎవరైతే సాయం చేస్తారో వారే దేవుళ్ళు.
దేవుడు ప్రత్యక్షంగా ఏదో సినిమాల్లో చూపించినట్టు ఆకాశంలోనుండి ఊడిపడడు.మన చుట్టూ ఉంటాడు.
మనలో ఉంటాడు.అది నమ్మినవారు ఇక్కడ సుఖంగా వుంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకని అంటారా? అలాంటివారికోసమే ఈ ఆర్టికల్.ఆ బాలుడికి పట్టుమని 4 సంవత్సరాలు కూడా వుండవు.
అయితే కాలం అతనితో ఆడుకుంటోంది.సాయంకోసం దాతలను వెతుకుతున్నారు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లికి చెందిన ధర్మేంద్ర మౌలి అనే నాలుగేళ్ల బాలుడు అరుదైన ‘టీ సెల్ లింపోబ్లాస్టిక్ ట్యుకేమియా’ అనే బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడు.ఈ వ్యాధి నుంచి ఆ బాలుడు బయటపడాలంటే ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ’ చేయాలని వైద్యులు సూచించారు.
అయితే ఒక సూపర్ మార్కెట్‌లో చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న తాను బాబు చికిత్స కోసం అంత పెద్దమొత్తం వెచ్చించలేని పరిస్థితి.సర్జరీ చేయడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు అన్నారు.

ఇక ప్రస్తుతం ఆ బాలుడికి జరగుతున్న చికిత్సకు నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తుందని, కానీ సర్జరీకి అవసరమైన డబ్బుల కోసం దాతల సాయం కావాలని కోరారు.బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కాకినాడ నుంచి నగరానికి వచ్చానని, తాను సంపాదించిన డబ్బులతో తన బాబుకు చికిత్స అందించే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.సహకారం అందించాలనుకునే దాతలు తన మొబైల్ నంబర్ 9642842896లో సంప్రదించాని బాలుడి తండ్రి కోరాడు.
కాబట్టి మనసున్న దాతలెవరైనా ఉంటే సత్వరమే స్పందించండి.







