రామ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ది వారియర్ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన విధంగా లేవు.
అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.అయితే టికెట్ రేట్ల విషయంలో మాత్రం ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రామ్ మూవీకి టికెట్ రేట్లను తగ్గించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టికెట్ రేట్ల తగ్గింపు దిశగా చర్యలు చేపట్టని పక్షంలో రామ్ మూవీ దారుణంగా నష్టపోయే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది.
నైజాం, వైజాగ్ ఏరియాలకు ఈ సినిమా భారీ రేటుకు అమ్ముడైంది.ఈ సినిమాలో కృతిశెట్టి రేడియో జాకీగా కనిపించడం గమనార్హం.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం కూడా ఈ సినిమా కలెక్షన్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుండటం గమనార్హం.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇచ్చిన పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.
మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించుకున్నారు.

రామ్, లింగుస్వామి ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా కూడా థియేట్రికల్ కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కాకపోతే టాలీవుడ్ నిర్మాతలు మారాల్సిన సమయం అయితే ఆసన్నమైనట్టేనని చెప్పవచ్చు.టాలీవుడ్ ప్రొడ్యూసర్లు పరిమిత బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుంది.







