జవాన్ సినిమాలో విజయ్ దళపతి.. ఈ సినిమా కోసం విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ చాలా రోజుల తర్వాత జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమాని షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో చేయడం విశేషం.

 Vijay Thalapathy Remuneration For Shahrukh Khan Jawan Film , Vijay Thalapathy, S-TeluguStop.com

అట్లీ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇకపోతే ఈమధ్య కాలంలో ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ హీరో అతిథి పాత్రలో నటించడం సర్వసాధారణం అయింది.

ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం విజయ్ ఒకరోజు కాల్ షీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.అయితే ఈ ఒక్క రోజు నటించడం కోసం ఈయన ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీగా ఈ సినిమాలో నటిస్తున్నారట.

కేవలం తనకు డైరెక్టర్ అట్లీ, షారుక్ ఖాన్ తో మంచి అనుబంధం ఉండటం వల్లే తాను ఈ సినిమాలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తున్నారని తెలుస్తుంది.

Telugu Bollywood, Jawan, Kollywood, Shahrukh Khan-Movie

ఈ విధంగా జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ తో పాటు విజయ్ దళపతి కూడా నటిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా వచ్చే యేడాది జూన్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

అయితే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.ఇక ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇలా అట్లీ దర్శకత్వంలో నయనతార షారుఖ్ ఖాన్ సినిమా అంటేనే సినిమాపై భార్య అంచనాలు పెరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube