సినీ ఫీల్డ్ లో పుకార్లు అనేవి కామన్ అనే చెప్పాలి.ఎప్పుడు ఎవరో ఒకరి గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
హీరో హీరోయిన్స్ కలిసి బయట కనిపిస్తే చాలు వారి మధ్య ఏదో ఉందని పుకార్లు అల్లేస్తూ వారి గురించిన వార్తలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.మాములుగా ఎప్పుడు హీరోయిన్ గురించిన లవ్, పెళ్లి కి సంబందించిన పుకార్లు వస్తూ ఉంటాయి.
కానీ ఈసారి అలా కాదు.హీరో గురించిన పుకారు నెట్టింట షికారు చేస్తుంది.టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు.ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు.
ఇక ఇప్పుడు ఈయనపై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.రామ్ తన చిన్ననాటి స్నేహితురాలుని పెళ్లి చేసుకో బోతున్నాడు అని నెట్టింట ఒక వార్త వైరల్ అయ్యింది.
అంతేకాదు ఆ అమ్మాయిని త్వరలోనే పరిచయం చేయబోతున్నాడు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి.
కానీ ఈ వార్తలన్నీ అబద్ధం అని తెలుస్తుంది.
ఈ వార్తలపై స్వయంగా రామ్ నే స్పందించి వీటికి ఫుల్స్టాప్ పెట్టారు.నేను చిన్నప్పుడే స్కూల్ కి సరిగ్గా వెళ్లే వాడినే కాదు అలాంటిది నాకు లవ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు రామ్.
అంతేకాదు.ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలు కూడా లేవని క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడింది.

ఇక రామ్ సినిమా విషయానికి వస్తే.ప్రెసెంట్ రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ”ది వారియర్” సినిమా చేస్తున్నాడు.ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండగా.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే పడింది.చూడాలి మరి రామ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.ఇక పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.







