చైనాకు చెందిన ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లపై తాజాగా జర్మనీ నిషేధం విధించింది.నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఆదేశాలతో జర్మనీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
యూరప్ వ్యాప్తంగా నోకియా సంస్థ 5G నెట్‌వర్క్‌లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే టెక్నాలజీపై పేటెంట్ హక్కులను కలిగి ఉంది.దీని కోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోలు అంటే మన రూపాయలలో కొన్ని వేల కోట్ల రూపాయిలు పెట్టుబడిగా పెట్టింది.
అయితే.ఒప్పో, వన్ ప్లస్ సంస్థలు నోకియాతో ఒప్పందం చేసుకోకుండా, నోకియా నుంచి ఎలాంటి లైసెన్స్ తీసుకోకుండానే ఈ టెక్నాలజీని వాడుతున్నాయి.దీంతో నోకియా కంపెనీ గత ఏడాది జూలైలో యూరప్‌లోని పలు దేశాల్లో ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది.తాజాగా నోకియా ఫైల్ చేసిన కేసుపై మాన్‌హీమ్ కోర్టు విచారించి తీర్పు వెల్లడించడంతో జర్మనీలో ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం లేదు.
అయితే కోర్టు తీర్పును తాము హైకోర్టు సవాల్ చేస్తామని ఒప్పో అనడం కొసమెరుపు.

కాగా ఒప్పో సంస్థ మాట్లాడుతూ.తమ సంస్థ సొంత, థర్డ్ పార్టీలకు చెందిన టెక్నాలజీలను గౌరవిస్తుందని.మొబైల్ తయారీ పరిశ్రమలో లైసెన్సింగ్ సహకారానికి ఒప్పో కట్టుబడి ఉందని చెబుతోంది.
పిటిషన్‌లు, లా సూట్ల ద్వారా లబ్ధి పొందే విధానాన్ని ఒప్పో వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా తెలిపింది.అటు నోకియా కంపెనీ గతంలో కూడా యాపిల్, లెనోవాలపై కూడా లాసూట్ ఫైల్ చేసిన సంగతి విదితమే.
వీటికి సంబంధించి రెండు బిలియన్ డాలర్ల మొత్తాన్ని నోకియా కంపెనీకి చెందిన NSN, అల్కాటెల్-లూసెంట్ అనే సంస్థలకు యాపిల్ చెల్లించడం గమనార్హం.







