టాలీవుడ్‌ లో వంద కోట్ల హీరోలు ఎవరో తెలుసా?

బాలీవుడ్‌ లో ఒకప్పుడు స్టార్‌ హీరోలు పాతిక కోట్లు.యాబై కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు అంటే బాబోయ్ అంటూ తెలుగు హీరోలు స్వయంగా గుండెల మీద చేయి వేసుకునే వారు.

 Tollywood Heros Remuneration For Up Coming Movies , Film News , Mahesh Babu ,-TeluguStop.com

కాని ఇప్పుడు తెలుగు మరియు తమిళ హీరోలు వంద కోట్ల పారితోషికం కు చేరుకున్నారు.మొదట సౌత్‌ లో విజయ్ వంద కోట్ల పారితోషికంను తీసుకున్న విషయం తెల్సిందే.

ఆయన గత రెండు మూడు సంవత్సరాలుగా కమిట్ అయిన సినిమాలన్నింటికి కూడా వంద కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నారు.సినిమా ఆ పై సాధిస్తే వాటిలో కూడా వాటాను తీసుకుంటూ ఉన్నాడు.

మొత్తానికి విజయ్ సౌత్‌ లో మొదటి వంద కోట్ల ను దక్కించుకున్నాడు.

Telugu Mahesh Babu, Powan Kalyan, Prabas, Tollwyood, Vijay-Movie

ఇప్పుడు ఆయన కాకుండా సౌత్‌ లో మరి కొందరు హీరోలు కూడా వంద కోట్ల కు పైగా తీసుకుంటున్నారు.తెలుగు లో మహేష్ బాబు వంద కోట్ల వరకు చేరాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ మినిమం గా వంద కోట్లు అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

తెలుగు లో వంద కోట్లకు కాస్త దగ్గర ఉన్నది మాత్రం పవన్‌ కళ్యాణ్ కాగా మరో వైపు మరో ఇద్దరు యంగ్‌ హీరోలు కూడా 75 నుండి 85 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నారట.ఆ ఇద్దరు హీరోలు త్వరలోనే వంద కోట్ల కు చేరే అవకాశాలు ఉన్నాయి.

మొత్తంగా తెలుగు సినిమా నిర్మాతలు బ్రేక్ ఈవెన్ సినిమా లు రాక ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో వంద కోట్ల వసూళ్లు కష్టంగా ఉన్న సమయంలో హీరో లు వంద కోట్లు తీసుకుంటే పరిస్థితి ఏంటీ అంటున్నారు.హీరోల పారితోషికాలు పెంచారని టికెట్ల రేట్లు పెంచారు.

టికెట్ల రేట్లు పెంచితే అసలు సినిమా కు జనాలు రావడం మానేస్తున్నారు.దాంతో హీరోలు పారితోషికం తీసుకోవడం తగ్గించాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube