పోలీసులు విధుల్లో వుండగా వారికి 8 అడుగుల దూరంలోవీడియో రికార్డింగ్ ను నిషేధించే చట్టంపై అమెరికాలోని ఆరిజోనా రాష్ట్ర గవర్నర్ డౌగా డ్యూసీ ఆదివారం సంతకం చేశారు.దీని ప్రకారం సాధారణ పౌరులు … పోలీసులు విధి నిర్వహణలో వుండగా 8 అడుగుల దూరంలోపు వారిని వీడియో రికార్డింగ్ చేయకూడదు.
ఈ నిబంధనను అతిక్రమించిన వారికి 30 రోజుల వరకు జైలు శిక్ష, 500 డాలర్ల జరిమానాతో పాటు ఏడాది వరకు వరకు పోలీసుల పరిశీలనలో వుండాల్సి వుంటుంది.అయితే తొలిసారి పట్టుబడితే వారిని క్షమించి వదిలివేయాలని చట్టం చెబుతోంది.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేయడం, అనుమానాస్పద వ్యక్తిని ప్రశ్నించడం, సమన్లు జారీ చేయడం వంటిని పోలీసు కార్యకలాపాలుగా చట్టం నిర్వచిస్తోంది.అయితే పోలీసులు.వీడియో రికార్డింగ్ చేసే వారి సమీపంలోకి వస్తే పరిస్ధితి ఏంటని కొందరు విమర్శిస్తున్నారు.అయితే ఆ వ్యక్తి అనుమానాస్పదంగా లేనంత వరకు పోలీసులు ఆ ఎనిమిది అడుగుల నిషేధిత ప్రదేశాన్ని దాటి రావొచ్చని బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ నేత జాన్ కవానాగ్ అన్నారు.
కానీ శాసనసభలో ఈ వాదనతో డెమొక్రాట్లు వాదించారు.

విధుల్లో వున్న పోలీసు అధికారులను చిత్రీకరించే ప్రయత్నాలు తాను కూడా చేశానని.ఆ సమయంలో ఎవరైనా సరే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అనుమానాస్పద వ్యక్తేనని ఆరిజోనా రాష్ట్ర సెనేటర్ మార్టిన్ క్యూజాడా వ్యాఖ్యానించారు.ఆ సమయంలో తమను ఎందుకు చిత్రీకరిస్తున్నారో చూడటానికి వారు దూకుడుగా మీ వైపుకు వస్తారని ఆయన అన్నారు.
బలప్రయోగం, నిరాశ్రయులైన వ్యక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలకు సంబంధించి ఫీనిక్స్ పోలీస్ విభాగంపై బైడెన్ న్యాయ విభాగం దర్యాప్తుకు ఆదేశించిన ఏడాదికి ఆరిజోనా రాష్ట్రం ఈ చట్టం చేయడం గమనార్హం.దేశంలోని ప్రతి వ్యక్తి చట్టబద్దమైన , సమర్ధవంతమైన పారదర్శకమైన వివక్షకు తావు లేని పోలీసింగ్ నుంచి ప్రయోజనం పొందేలా చూడటం పౌర హక్కుల విభాగం ప్రాధాన్యతలలో ఒకటని అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ ఆ సమయంలో అన్నారు.
పోలీసు అధికారులు రాజ్యాంగానికి కట్టుబడి, సమాఖ్య పౌర హక్కుల చట్టాలకు అనుగుణంగా వుండాలని క్లార్క్ వ్యాఖ్యానించారు.







