శ్రీధర్ గాదే, కిర‌ణ్ అబ్బ‌వ‌రం కలయికలో వస్తున్న 'నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని' టీజర్ కు అనూహ్య స్పందన..

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.

 Kiran Abbavaram Nenu Meeku Kaavalsinavadini Movie Teaser Released Details, Kiran-TeluguStop.com

అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.

ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.కోడి రామకృష్ణ గారి సొంతూరు పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో ఈ టీజర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

హీరో హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లేస్ తింటున్నావా అన్న.

లేదు కూర్చొని తింటున్న తమ్ముడు.యావరేజ్ గా ఉన్న అమ్మాయిల విలువ.

నాలాంటి కరువులో ఉన్న వాళ్లకు తెలుస్తుంది కానీ.నీలాంటి కడుపు నిండిన వాళ్లకు ఏం తెలుస్తుంది మామ.హీరోలంట్రా.గేట్లు వేయండి షో వేద్దాం.

అంటూ అదిరిపోయే డైలాగులతో టీజర్ అంతా రచ్చ రచ్చ చేశారు కిరణ్ అబ్బవరం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది.కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు.ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

న‌టీన‌టులు:

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు.

టెక్నికల్ టీమ్:

స‌మ‌ర్ప‌ణ‌.కోడి రామ‌కృష్ణ‌, బ్యాన‌ర్‌.కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, లిరిక్స్‌.భాస్క‌ర్ భ‌ట్ల, ఎడిట‌ర్‌.ప్ర‌వీన్ పూడి, ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.ఉపేంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ .భ‌ర‌త్ రొంగలి, పిఆర్ ఓ.ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌, సినిమాటోగ్ర‌ఫి.రాజ్ నల్లి, సంగీతం.మ‌ణిశ‌ర్మ‌, కో-ప్రోడ్యూస‌ర్‌.న‌రేష్ రెడ్ది మూలే, ప్రోడ్యూస‌ర్‌.కోడి దివ్య దీప్తి, డైర‌క్ట‌ర్‌.

శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్).

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube