55 ఏళ్లుగా భారత్‌లోనే వుంటున్నా.. నాకెందుకు పౌరసత్వం ఇవ్వరు: బాంబే హైకోర్టులో వృద్ధురాలి పిటిషన్

భారతీయ పౌరసత్వం కోసం ఓ వృద్ధురాలు అలుపెరగని పోరాటం చేస్తోంది.55 ఏళ్ల క్రితం తనకు భారతీయుడితో వివాహమైందని, తన పిల్లలు, మనవలు, మనవరాళ్లంతా భారతీయులేనని.మరి తనకెందుకు భారతీయ పౌరసత్వం ఇవ్వరంటూ 55 ఏళ్ల మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.బ్రిటీష్ పాస్‌పోర్ట్‌లు కలిగి వున్న భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు తాను ఉగాండాలో జన్మించానని బాధిత మహిళ పిటిషన్ లో పేర్కొంది.1966లో తన తల్లి పాస్‌పోర్ట్ పై తాను భారతదేశానికి వచ్చానని.అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నానని వృద్ధురాలు పేర్కొంది.

 55 Years Old Woman Moves Bombay High Court For Seeking Indian Citizenship,bombay-TeluguStop.com

అయితే తన వద్ద చెల్లుబాటయ్యే పత్రాలు లేవని , కానీ 1977లో భారతీయ పౌరుడినే వివాహం చేసుకున్నానని కోర్టుకు తెలిపింది.
సెప్టెంబర్ 1955లో జన్మించిన వృద్ధురాలు ప్రస్తుతం.

ముంబైలోని అంధేరీలో నివసిస్తోంది.ఈ క్రమంలో ఏళ్లుగా భారతీయ పౌరసత్వం కోసం పోరాటం చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో 2019లో ముంబై డిప్యూటీ కలెక్టర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా తన దరఖాస్తును తిరస్కరించారని వాపోయింది.పిటిషనర్ తరపు న్యాయవాది ఆదిత్య చితాలే మాట్లాడుతూ.

తన క్లయింట్ తల్లితో కలిసి 1966 నుంచి భారత్ లోనే వుంటున్నారని వాదించింది.ఆన్‌లైన్ దరఖాస్తులో ఆమె వీసా 2019 వరకు చెల్లుబాటులో వుందని తప్పుగా పేర్కొన్నారని.

జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, ఎస్ఎం మోదక్ లతో కూడిన డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.డిప్యూటీ కలెక్టర్ పొరపాటు కారణంగా ఆమె భారత పౌరసత్వానికి అర్హత లేదని అధికారులు నిర్ధారించారని ఆదిత్య వాదించారు.

Telugu Bombay, British Embassy, Citizenship, Indian Passport-Telugu NRI

తాను భారతీయ పాస్‌పోర్ట్ , పౌరసత్వం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నానని .తన తల్లిదండ్రుల బ్రిటీష్ పాస్‌పోర్ట్‌లను సమర్పించడానికి ప్రయత్నించానని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే మైనర్ గా వున్నందున తన తల్లితో కలిసి భారతదేశానికి ఎలా ప్రయాణించిందో తెలిపే పత్రాలను తమకు సమర్పించాలని అధికారులు కోరారని పేర్కొన్నారు.పాస్‌పోర్ట్ పొందాలంటే పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం తనను ఆదేశించిందని ఆమె తెలిపారు.

ఆ తర్వాత తాను పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.అధికారులు దానిని తిరస్కరించారని పిటిషన్‌దారు చెప్పారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపు న్యాయవాది అద్వైత్ సేత్నా వాదిస్తూ.విదేశాల నుంచి పాస్‌పోర్ట్‌ను పంపినట్లయితే మహిళకు భారత పౌరసత్వం మంజూరు చేయవచ్చన్నారు.

పిటిషనర్ తన తల్లిదండ్రులకు బ్రిటీష్ పాస్‌పోర్ట్‌లు వున్నందున ఆమె బ్రిటీష్ ఎంబసీని ఆశ్రయించారని.ఆమె వద్ద అవసరమైన పత్రాలు లేనందున బ్రిటీష్ ఎంబసీ పాస్‌పోర్ట్ మంజూరు చేయడానికి నిరాకరించిందని అద్వైత్ తెలిపారు.

అలాగే పిటిషనర్ అవసరమైన పత్రాలను పొందడానికి ఉగాండాలోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని , కేంద్రం ఈ పిటిషన్ ను విరోధిగా పరిగణించడం లేదని సేత్నా అన్నారు.ఇరువర్గాల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం ఆగస్ట్ 22 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube