అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బహుశా మొట్టమొదటి సారిగా ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.
అమెరికాలో మహిళల హక్కులకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది అనేక రంగాల మహిళలకు అమెరికా సముచిత స్థానం కలిపిస్తుంది, రాజకీయ రంగంలో సైతం అక్కడి మహిళలు పురుషులతో పోటీ పడుతుంటారు.అలాంటి అగ్ర రాజ్యంలో మహిళల ప్రాధమిక హక్కు పై ఉక్కుపాదం మోపింది అక్కడి కోర్టు.
మహిళల అబార్షన్ హక్కు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమెరికా మహిళ లోకం మొత్తాన్ని తీవ్ర ఆవేదన చెందేలా చేసింది.ఈ పరిస్థితులు నేపధ్యంలో బిడెన్ సైతం కోర్టు తీర్పుపై అప్పట్లో మండిపడ్డారు కూడా.
అయితే తాజాగా
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా మహిళల హక్కులను కాపాడే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.అవాంచిత గర్భాన్ని తొలగించుకునే అవకాశం లేకుండా 50 ఏళ్ళుగా ఉన్న అబార్షన్ హక్కు చట్టాన్ని తొలగించిన కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జో బిడెన్ మళ్ళీ వారి హక్కులను వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితులలో మహిళలు అబార్షన్ చేయించుకునే విధంగా ఓ చట్టాన్ని రూపొందించారు బిడెన్.
బిడెన్ ఈ సరికొత్త చట్టం పై సంతకం చేసిన వెంటనే అమెరికా మహిళలు బిడెన్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.
కోర్టు మహిళల హక్కులు అడ్డుకున్నా ఫెడరల్ చట్టం ద్వారా మహిళల హక్కులు కాపాడే అవకాశం కలిగిందని, ఈ ప్రకటన చేయడం ఎంతో సంతోషంగా ఉందని బిడెన్ ప్రకటించారు.కాగా ఈ చట్టం కు కొన్ని పరిమితులు కూడా ఉంటాయని తెలిపారు.
అలాగే కోర్టు లో మరోసారి అబార్షన్ హక్కు చట్టాన్ని ఆమోదించేలా చర్యలు చేపట్టాలని సంభందిత అధికారులకు బిడెన్ ఆదేశాలు జారీ చేశారు.







