సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌లైన పాన్ ఇండియా విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుతాల‌ను ఆవిష్క‌రించిన సుప్రీమ్ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం రూపొందిస్తోన్న మ‌రో అద్భుత కావ్యం ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’.రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తొలి భాగం సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

 Pan India Visual Wonder 'ponniyan Selvan' Teaser Released By Superstar Mahesh ,-TeluguStop.com

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.శుక్ర‌వారం ‘పొన్నియన్ సెల్వన్’ తెలుగు టీజర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు.

‘నా ఫేవరెట్ డైరెక్టర్స్‌లో ఒక‌రైన మ‌ణిర‌త్నంగారు తెర‌కెక్కిస్తోన్న ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ సినిమా టీజ‌ర్‌ను లాంఛ్ చేయ‌డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణి ర‌త్నం తెర‌కెక్కించిన చిత్రాలు ఓ వైపు అయితే.‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ మ‌రో వైపు నిలుస్తుంది.విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించారు.చోళ కాల‌పు రాజులు.

యుద్ధాలు.మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల‌పై సినిమాను రూపొందించిన‌ట్లు టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

ఒక్కో సీన్ ఓ మాస్ట‌ర్ పీస్‌లా క‌నిపిస్తోంది.టీజ‌ర్ చూస్తుంటే .సెప్టెంబ‌ర్ 30న ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ‘పొన్నియన్ సెల్వన్’ రూపంలో అద్భుత‌మైన దృశ్య కావ్యాన్ని లెజెండ్రీ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం ఆవిష్క‌రించిన‌ట్లు తెలుస్తోంది.సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ ప్రొడక్షన్స్ సంస్థలు ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది.1950ల్లో విడుదలై సెన్సేషనల్‌ సక్సెస్‌ అయినప్పటికీ జనాలను ఆకట్టుకుంటున్న కల్కి తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.

Telugu Prakashraj, Aishwaryarai, Jayam Ravi, Jayaram, Karthi, Mani Ratnam, Hiban

పదో శతాబ్దానికి చెందిన సాహోసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల పొన్నియిన్ సెల్వన్‌.చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు.తదనంతర కాలంలో రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్‌ సెల్వర్‌ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఇది.ఆయన రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించ‌నుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube