టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న హీరోలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ ముందువరసలో ఉంటారు.ప్రముఖ టాలీవుడ్ విలన్లలో ఒకరైన నితిన్ మెహతా అఖండ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించిన నితిన్ మెహతా ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు.
నితిన్ మెహతా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత గడ్డం పెంచి కొత్త లుక్ ను ట్రై చేశానని ఆయన అన్నారు.
అయితే మోడలింగ్ లోకి, సినిమాలలోకి రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.హైదరాబాద్ విమానశ్రయంలో ఉన్న సమయంలో ఒక ఫిల్మ్ మేకర్ నన్ను చూశాడని ఆయన తెలిపారు.
ఆ తర్వాత ఢిల్లీలో మోడల్ గా కనిపించానని ఆయన చెప్పుకొచ్చారు.
అక్కడ మోడల్ గా పాల్గొనడంతో ఫ్యాషన్ వీక్స్ లో పాల్గొనాలని నాకు ఫోన్ వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.

ఈ విధంగా సినిమాలలో యాడ్స్ లో నటించే ఛాన్స్ నాకు దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.బాలయ్యతో అఖండ సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభూతి అని ఆయన తెలిపారు.బాలయ్యతో కలిసి పని చేసే సమయంలో నేను ఇండస్ట్రీకి కొత్త అనే భావన కలగలేదని ఆయన చెప్పుకొచ్చారు.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కిక్ ఇస్తాయని నితిన్ మెహతా పేర్కొన్నారు.సౌత్ సినిమాలు బాగుంటాయని నేను సినిమాల్లోకి రావడానికి ముందే సౌత్ సినిమాలు చూసేవాడినని నితిన్ మెహతా చెప్పుకొచ్చారు.భవిష్యత్తులో విలన్ పాత్రలు చేయాలని ఉందని నితిన్ మెహతా పేర్కొన్నారు.
మహేష్, బన్నీ, పవన్, మరి కొందరు స్టార్ హీరోలతో తన్నులు తినాలని ఉందని నితిన్ మెహతా చెప్పుకొచ్చారు.







