బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరించగా సుధీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రష్మీ ఆస్థానాన్ని భర్తీ చేస్తుంది.
ఇక ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా ఆది రష్మీపై వేసిన పంచ్ డైలాగులు హైలైట్ అయ్యాయి.
ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో ఆషాడంలో అల్లుళ్లు అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే రష్మీ ఆషాడంలో అల్లుళ్లు ఉండకూడదు వెళ్లిపోండి అంటుంది.అదే సమయంలోనే వర్ష కలగ చేసుకుని అక్క మీరు ఇక్కడున్నారు బావ అక్కడ ఉన్నారు అంటూ అనడంతో రష్మి ఎవరే నీకు అక్క అంటూ కోప్పడింది.
ఇక ఈ విషయంపై అది కలుగజేసుకొని అందరికీ ఆషాడం ఒక నెల అయితే రష్మీ సుధీర్ కి మాత్రం ఒక ఏడాది అంటూ పంచ్ వేశాడు.

ఆది ఇలా అనడంతో రష్మి తెగ సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుంది.అయితే ఆది అన్న ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మీ సుధీర్ కు ఏడాది పాటు ఆషాడం అంటే ఒక ఏడాది తర్వాత సుధీర్ తిరిగి ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేయబోతున్నారా.కేవలం కొన్ని అగ్రిమెంట్ల కారణంగా మాత్రమే ప్రస్తుతం ఈటీవీ నుంచి బయటకు వెళ్లారా? అందుకే హైపర్ ఆది అలా అన్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.







