ప్రస్తుతం దేశంలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరనే సంగతి తెలిసిందే.రణ్ బీర్ కపూర్ అలియా భట్ వివాహం గ్రాండ్ గా జరగగా పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉన్న జోడీలలో అలియా రణ్ బీర్ జోడీ ఒకటి.
అలియా భట్ గర్భవతి కావడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను అలియా భట్ వేగంగా పూర్తి చేస్తున్నారు.ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీని అలియా రిజెక్ట్ చేయడానికి పెళ్లి కారణమని సమాచారం.
అలియా భట్ తాజాగా తన భర్త గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రణ్ బీర్ అంటే నాకు బాల్యం నుంచి క్రష్ అని ఆమె చెప్పుకొచ్చారు.
రణ్ బీర్ నేను కలిసి ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయలేదని ఆమె అభిప్రాయపడ్డారు. బ్రహ్మాస్త్రం మూవీలో నేను, రణ్ బీర్ కలిసి నటించామని ఆ సినిమా సమయంలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడిందని ఆమె చెప్పుకొచ్చారు.
బ్రహ్మాస్త్రం మూవీ కొరకు ఒకే విమానంలో ప్రయాణిస్తున్నామని విమాన ప్రయాణ సమయంలో విమానంలో సీటు సరిగ్గా లేదని అలియా భట్ చెప్పుకొచ్చారు.అందువల్ల రణ్ బీర్ నా పక్కన వచ్చి కూర్చున్నారని ఆ సమయంలో తాను, రణ్ బీర్ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నామని అలియా భట్ పేర్కొన్నారు.
బ్రహ్మాస్త్రంతో అలియా భట్, రణ్ బీర్ సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ లోని గ్రాఫిక్స్ సీన్లు నాసిరకంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
అలియా భట్ కు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ దక్కాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.







