మత ప్రబోధకుడిగా ప్రసిద్ధి చెందిన కేఏ పాల్ కి ప్రపంచ దేశాల్లో ఇప్పటికి మంచి గుర్తింపు ఉంది.వివిధ దేశాల నేతలతో ఆయన సఖ్యతగా మెలుగుతూ, తన స్థాయి ఏమిటనేది చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇక రాజకీయాలలోను అదేవిధంగా ఉన్నత స్థానానికి వెళ్లాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని ఆయన స్థాపించారు.కానీ వర్క్ అవుట్ కాలేదు ఇక 2023 ఎన్నికల్లో తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పాల్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే గత కొంతకాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతూ , తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అని పదేపదే మీడియా, సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.అయితే కేఏ పాల్ ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలతో మిగతా పార్టీలు పాల్ విమర్శలను పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆయన ‘ పాల్ రావాలి.పాలన మారాలి’ అనే నినాదంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఏపీలో జూలై 9 నుంచి ఆయన యాత్ర మొదలు కాబోతోంది.జులై 9న విశాఖ,, జులై 10 విజయనగరం , ఆ తర్వాత శ్రీకాకుళం, కాకినాడ ,రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు చిత్తూరు అనంతపురం, కర్నూలు లో పర్యటించనున్నారు.జులై 23 నుంచి ఆగస్ట్ 1 వరకు తెలంగాణ లో టూర్ నిర్వహించనున్నారు.అలాగే సెప్టెంబర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన భారీ బహిరంగ సభలను నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.







