సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఉంటారు అని చెబుతూ ఉంటారు.అయితే ఇక ఇలాంటివి కేవలం కామన్ మ్యాన్ విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా అప్పుడప్పుడూ నిజం అవుతూ ఉంటుంది అని చెప్పాలి.
ఇక అందరికీ తెలిసిన ఎంతో పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ పోలికలతో కొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం జరుగుతూ ఉంటుంది.ఇలాంటివి జరిగినప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో సార్ హీరోయిన్ సమంత పోలికలతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఆశు రెడ్డి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక ఆశు రెడ్డి కి ఒక్కసారిగా సోషల్ క్రేజ్ వచ్చింది.ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం సెలబ్రిటీగా మారిపోవడం ఇలా అన్నీ జరిగిపోయాయి.
ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పోలికలతో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్. ఈ అమ్మడికి తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది.త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది అని చెప్పాలి.
తన ప్రియసఖుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలిగా మారిపోయింది.అయితే ఇటీవలే అచ్చం ఆలియా భట్ ను పోలిన ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఇప్పుడు ఆమె ఫొటోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి.

ఈ అమ్మాయిని చూసిన తర్వాత నిజంగానే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేది మరోసారి నమ్ముతున్నారు అందరు.ఇంస్టాగ్రామ్ లో ఇలా అలియా భట్ పోలికలతో ఉన్న అమ్మాయి చేసిన రీల్ వైరల్ గా మారిపోయింది.ఈ అమ్మాయి పేరు సెలెస్టి బైరాగి చూడ్డానికి అచ్చం ఆలియాభట్ లాగే ఉంటుంది.
కానీ ఆమె ఆలియా భట్ కాదు కనీసం ఆమెతో ఎలాంటి సంబంధం కూడా లేదు.అయితే ఆలియా భట్ కు డూప్లికేట్ గా ఉండడానికి అస్సలు ఇష్టం లేదు అంటూ చెబుతుంది ఈ అమ్మాయి.
అయితే ఆలియా భట్ మాత్రం తన ఫేవరెట్ యాక్ట్రెస్ అంటూ మాటలతో మాయ చేస్తుంది.ఈ అమ్మాయి చేసిన రీల్ వైరల్ గా మారిపోవడం తో చూసి అందరూ షాక్ అవుతున్నారు.







