'సార్' కోసం రిస్క్ చేస్తున్న ధనుష్.. ఇదే సినిమాకు హైలెట్ అంటున్న మేకర్స్!

జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న నటుడు ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు.

 Dhanush Upcoming Movie Sir Latest Update , Sir Movie, Dhanush, Kollywood, Sekhar-TeluguStop.com

అయితే ధనుష్ అక్కడే ఉండిపోకుండా ఇటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడు తున్నాడు.ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

కానీ ఈయన మార్కెట్ పెంచుకోవడంతో మాత్రం కొద్దిగా వెనుకబడి ఉన్నాడు.ధనుష్ తెలుగులో కమర్షియల్ హిట్ సాధించలేదు.దీంతో ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమా పట్టాలెక్కక ముందే మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.‘సార్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.మరి ఈ రెండు సినిమాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవాలని చూస్తున్నాడు.అందుకే మరింత రిస్క్ చేస్తున్నాడు.సార్ కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతున్నట్టు టాక్.

Telugu Dhanush, Kollywood, Sekhar Kammula, Sir, Tollywood, Venky Atluri-Movie

తెలుగు, తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతున్న సార్ సినిమాను హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.అయితే తెలుగులో ధనుష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పించడం కంటే.ఆయన్నే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పమని చెప్తే సినిమాకు మరింత ఆకర్షణగా ఉంటుంది అని మేకర్స్ ధనుష్ తోనే తెలుగు డబ్బింగ్ చెప్పమన్నారట.

దీంతో ధనుష్ కొద్దిగా రిస్క్ అయినా కూడా చెప్పడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube