పురుగులతో స్నాక్స్ తయారీ.. మంచి హెల్దీ ఫుడ్ అంట?

పురుగులతో స్నాక్స్ తయారీ ఏంటని అనుకుంటున్నారా? మనిషికో బుద్ధి అన్నారు పెద్దలు.పురుగులంటే మామ్మూలు పురుగులు కాదండోయ్.

క్యాటర్‌పిల్లర్‌ (గొంగళిపురుగు) నుంచి స్నాక్స్‌ తయారుచేసే విధానాన్ని రూపొందించారు దక్షిణాఫ్రికాకు చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ వెండీ వెసెలా.ముఖ్యంగా నలుపు, ఆకుపచ్చటి రంగు పురుగుల్లో ఐరన్‌, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని ఆమె చెబుతోంది.

మన దగ్గర లేదు గాని, ఫారిని కంట్రీలో ఈ పురుగులను విరివిగా ఆరగిస్తారు.ఇక చైనా వంటి దేశాల్లో అయితే బతికున్నవాటినే అమాంతం నోటిలో వేసుకొని కారకరా స్నాక్స్ లాగా తినేస్తారు.

ఆ అలవాటు కారణంగానే వెండీ వెసెలాకి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది.ఆ పురుగులను డైరెక్ట్ గా తీసుకున్నపుడు ఒకింత ఇబ్బందికరం ఉంటుంది.

Advertisement

వాటిని అధిగమించేందుకు ఆమెకి స్నేక్స్ ఐడియా తట్టిందని చెప్పుకొచ్చింది.ఇక వాటిని అలా స్నాక్స్ రూపంలో గాని పూర్తి స్థాయిలో మార్చినట్లైతే చిన్నపిల్లలు కూడా వాటిని బాగా ఇష్టపడతారని అంటోంది ఈ కెమికల్ ఇంజినీర్.

అక్కడితో ఆగకుండా వీటిని టేస్ట్ చేసినట్లతే మరలా మరలా తిరిగి కావాలని అంటారని చెబుతోంది.అయితే వీటిని ఎలా తయారు చేస్తారో అనే డౌట్ మీకు వస్తోంది కదూ.దానికి కూడా ఆమె దగ్గర రెమిడీ వుంది.గొంగళి పురుగులను బాగా ఎండబెట్టి, తరువాత వాటిని పిండిరూపంలో మార్చుకోవాలట.

తయారైన పిండిని బిస్కెట్స్‌, చాక్లెట్లు తయారీలో వాడి స్నాక్స్‌ తయారుచేయొచ్చని ఆమె వివరిస్తోంది.వీటివలన అనేక ఉపయోగాలు ఉన్నాయని కూడా చెబుతోంది.

బేసిగ్గా ఈ పురుగులతో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.వీటి ద్వారా తయారైన స్నేక్స్ లో కూడా అంతేమొత్తంలో పోషకాలు ఉంటానని అంటోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అలాగే వీటివల్ల పర్యావరణానికి ముప్పు లేదని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు