కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.కలెక్టర్ బయటకి రావాలంటూ విద్యార్థుల నినాదాలు.

 Sfi Dharna In Front Of Collectorate-TeluguStop.com

కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు.విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు,పరిస్థితి ఉద్రిక్తం.

ఎట్టకేలకు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎస్ఎఫ్ఐ నేతలు.

యాదాద్రి జిల్లా:విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సోమవారం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని,ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి కోర్స్ పేరుతో కాలయాపన చేయరాదని, పాఠ్యపుస్తకాలను తక్షణమే అందివ్వాలని,ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్ర చేస్తుందని,సర్కార్ బడులను అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యా బోధన అందించాలని కోరారు.ప్రభుత్వం విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షకార్యదర్శులు,డివిజన్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube