టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డామినేషన్ సోషల్ మీడియాలో ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే.పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాల గురించి సినిమాల గురించి అప్డేట్లు వచ్చాయి అంటే చాలు రికార్డులు బ్రేకులు బద్దలు కొట్టాల్సిందే.
పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, మోషన్ పోస్టర్లు, ట్రైలర్లు,పాటలు ఇలా ప్రతి ఒక్క ఒకటి రికార్డులో బ్రేకింగ్ దశగా దూసుకెళ్తూ ఉంటాయి.
అలా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వారి ఆధిపత్యాన్ని చూపుతూ ఉంటారు.
కానీ సినిమాల విషయంలో యాక్టివ్ గా కనిపించే పవన్ అభిమానులు జనసేన పార్టీ విషయంలో మాత్రం ఇంత యాక్టివ్ గా కనిపించారని కేజీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు ఇంత లేజీగా ఉంటున్నారు.
బాధ్యత రహితంగా ఉంటున్నారు.సినిమా ప్రమోషన్స్ విషయంలో యాక్టివ్ గా ఉంటున్నారు అదే జనసేన పార్టీకి సంబంధించిన విషయాలను ట్రెండ్ చేసే సమయంలో మాత్రం అంతగా పట్టించుకోవడం ఎందుకు లేదు ఎందుకు అంటూ నిలదీశాడు డైరెక్టర్ సాయి రాజేష్.

అతని ట్వీట్ పై స్పందించిన అభిమానులు కరెక్టే అని కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం సాయి రాజేష్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.ఏంటి నువ్వు పెద్దరికం తీసుకున్నావా?అని ఒకరు ప్రశ్నించగా? లేదు ప్రశ్నిస్తున్న అంటూ కొన్ని ఉదాహరణలు చూపించడంతో వెంటనే ఇంకొకడు అసలు నువ్వు లైక్ రీ ట్వీట్ చేస్తావా అని ప్రశ్నించాడు.వెంటనే చెక్ చేసుకో అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చాడు సాయి రాజేష్.అలా మొత్తానికి సాయి రాజేష్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఒక చర్చకు దారి తీసింది.







