ఎస్ఎఫ్ఐ ధర్నా

సూర్యాపేట జిల్లా:స్కాలర్షిప్స్,ఫీజు రీయంబర్స్మెంట్ విద్యార్థులకు ఇచ్చే భిక్ష కాదని విద్యార్ధుల హక్కని తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్,ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.

 Sfi Dharna-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడాతూ గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు అందజేయాల్సిన ఉపకార వేతనాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని,దీని ద్వారా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు సమయానికి ఉపకార వేతనాలు అందకపోవడంతో కళాశాల ఫీజులు కట్టలేక చదువులు కొనసాగే పరిస్థితి లేదన్నారు.

విద్యారంగానికి బడ్జెట్ కేటాయించడంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందచేయటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అలసత్వం పాటిస్తుందని మండిపడ్డారు.విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుండా నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్య అందకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

దీని ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని,విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని,రానున్న ఎన్నికల్లో విద్యార్థుల ఆగ్రహానికి రాష్ట్రప్రభుత్వం బలికాక తప్పదన్నారు.

తక్షణమే పెండింగ్లోవున్న ఉపకార వేతనాలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube