లండన్ లో “ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి”

నాగశౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో ప్రస్తుతం షూటింగ్ విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఇది.

 Phalana Abbayi Phana Ammayi Shoot Progresses Across Picturesque Locations In Lon-TeluguStop.com

దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది.వివరాల్లోకి వెళితే…

ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే.

అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.

కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోంది.

నాయక, నాయిక లతోపాటు ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్రీకరణ జరుగుతోంది.ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక వర్గంతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube