వరల్డ్స్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న తెలుగు పుస్తకం!

కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన ‘పూలబాల వెంకట ప్రసాద్‌’ తెలుగు భాష సత్తాని చాటాడు.బహుభాషా కోవిదుడైన వెంకట ప్రసాద్‌ తెలుగులో 1265 పేజీలగల ‘భరతవర్ష’ నవలను 8 నెలల్లో రాసి వరల్డ్‌వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు.

 Krishna District Writer Poolabala Venkata Prasad Novel Bharatavarsha Got World W-TeluguStop.com

వెంకటప్రసాద్‌ తెలుగుతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, జర్మనీ, స్పానిష్‌, ఇటాలియన్‌ భాషల్లో మంచి దిట్ట.ఈ 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడడమే కాకుండా రచనలు కూడా చేశారు వెంకట ప్రసాద్.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మొదటి ఫ్రెంచ్‌ నవలా రచయిత ఈయనే.

రికార్డు సాధించిన ‘భరతవర్ష’ నవలలో 200 వృత్త పద్యాలు, 2.5లక్షల పదాలున్నాయి.వెయ్యి పేజీల నవల రాయడానికి ఎంతోమంది రచయితలు పదేళ్లకు పైగా సమయం తీసుకోగా.

మన వెంకట ప్రసాద్ కేవలం 8 నెలల్లోనే 1265 పేజీల భరతవర్షను రాయడం అరుదైన ఘటన అని చెప్పుకోవాలి.అందుచేతనే ప్రపంచ రికార్డును నెలకొల్పగలిగారు.దీనికోసం ఆయన రోజూ ఎంతో శ్రమించేవారు.రాత్రివేళ కేవలం రెండు మూడు గంటలు మాత్రమే పడుకుని మిగతా సమయమంతా నవలను రాస్తూనే ఉన్నారు.

తెలుగులో కష్టమైన 200 వృత్త పద్యాలతో కూడిన అతిపెద్ద గ్రాంధిక నవల రాయడం అంటే మామూలు విషయం కాదన్న సంగతి మీకు తెలిసినదే.

Telugu Krishna, Telugu, Latest, Writerpoolabala-Latest News - Telugu

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఇంకేమంటే, ట్రాన్స్‌ లిటరేషన్‌ టూల్‌ను వాడుతూ గూగుల్‌లో టైప్‌ చేస్టూ, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో 2,50000ల పదాలను వందలసార్లు సవరించి ప్రపంచంలోనే అతిపొడవైన నవలను తానే సొంతంగా ముద్రించుకోవడం.ఈ స్సందర్భంగా వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, “నాకు ఎంతో ఆనందంగా వుంది.ఈ ప్రపంచ రికార్డు అనేది తెలుగు భాషకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను.

ఈ నవలను అతి తక్కువ సమయంలో రాసే క్రమంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి.అయినా అవన్నీ నా లక్ష్యం ముందు చిన్నబోయాయి.” అని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube