స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది.అలవాటవ్వకపోతే తెలియదు గాని, ఒక్కసారి స్మార్ట్ ఫోన్ కి అలవాటైతే అది లేకుండా ఉండటం కష్టమే.
ఫోన్ లేక పిచ్చెక్కిపోయేవాళ్లను మనం అనేకమందిని మన చుట్టూనే చూస్తున్నాం.అంతలా మనిషి జీవన విధానంలో ఓ పాత్ర అయి కూర్చుంది మొబైల్ ఫోన్.
అయితే అలాంటి ఫోన్ వాడకం విషయంలో చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ వున్నాయి.అందులో ముఖ్యమైనది రాత్రంతా ఛార్జింగ్ పెట్టొచ్చా? లేదా? అనే అంశం.ఇపుడు ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించుకుందాం.
ఒకప్పుడు బేసిక్ మొబైల్ ఫోన్లను ఆలా రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచితే ప్రాబ్లెమ్ ఉండేది.
ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి లేవు.ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ని ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచినా ఎలాంటి ప్రమాదం లేదు.
ఎందుకంటే ప్రస్తుతం వాడకంలో ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీలు.ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇవి విద్యుత్‌ను సంగ్రహించకుండా నిరోధించే పరికరాలను ఇన్‌బిల్ట్‌గా కలిగి ఉంటున్నాయి.అయితే.అన్నివేళలా ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉంచడం మంచిది కాదు.మీ మోడల్ అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలదా? లేదా అన్నది ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే లిథియం- అయాన్ బ్యాటరీలు పరిమిత ఛార్జింగ్ సైకిళ్లను కలిగి ఉంటాయి.ఐఫోన్లో ఈ సంఖ్య 500 వరకు ఉంటుంది.0 పర్సెంట్ నుంచి 100 పర్సెంట్‌ను ఒక సైకిల్‌గా పరిగణిస్తాం.కాబట్టి.ఫోన్ మొత్తం డెడ్ అయ్యాక ఛార్జింగ్ చేసినట్లయితే.ఒక సైకిల్‌ను త్వరగా ఉపయోగించినట్లవుతుంది.కానీ ఫోన్ బ్యాటరీ 90 శాతం ఉన్నప్పుడు.
ఛార్జ్ చేస్తే అప్పుడు ఆ సైకిల్ పూర్తవదు.అందుకే.
ఎక్కువగా ఫోన్ ఛార్జింగ్‌ను 40-80 శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.







