వాల్తేర్ వీరయ్య విలన్ అతనేనా..!

మెగాస్టార్ చిరంజీవి, కె.ఎస్ రవీంద్ర కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

 Biju Menon Villain For Megastar Chiranjeevi Valtair Veerayya Details, Biju Menon-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

కె.ఎస్ రవీంద్ర మూవీ కి వాల్తేర్ వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది.2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.చిరు 154వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

వాల్తేర్ వీరయ్య సినిమాలో విలన్ గా మళయాళ నటుడు బిజు మీనన్ ని సెలెక్ట్ చేసినట్టు టాక్.

ఇదివరకు గోపీచంద్ నటించిన రణం సినిమాలో బిజు మీనన్ తెలుగులో నటించారు.మళయాళంలో ఆయన ప్రత్యేకమైన పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు.

ఆయన చేసిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.విలన్ గా బిజు మీనన్ మెగాస్టార్ తో ఢీ కొట్టబోతున్నారని తెలుస్తుంది.

మరి ఈ క్రేజీ కాంబో సెట్స్ మీద ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube