డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ

సూర్యాపేట జిల్లా:డ్రగ్స్ నివారణలో యువత ప్రధాన పాత్ర పోషించాలని,గ్రామ,జిల్లా,రాష్ట్రం,దేశం యొక్క అభ్యున్నతికి యువశక్తి ప్రధానమని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.మాదకద్రవ్యాల అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం కాసరబాద గ్రామం డబుల్ బెడ్ రూం నివాసాల ప్రాంగణంలో ఎస్ఐ,కానిస్టేబుల్ ఉచిత శిక్షణలో ఉన్న యువతతో ఎస్పీ డ్రగ్స్ నివారణ,యువత బాధ్యతపై ప్రతిజ్ఞ చేయించారు.

 Pledge Against Drugs-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ ను ఈరోజుల్లో అనేక విధాలుగా దుర్వినియోగం చేస్తున్నారని,మత్తుకు అలవాటుపడి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.గతంలో డ్రగ్స్ అనేది పెద్ద పట్టణాల్లో మాత్రమే వినిపించేది,ప్రస్తుత రోజుల్లో ఈ డ్రగ్స్,గంజాయి,కొకైన్ లాంటి అనేక రకాల డ్రగ్స్ అక్రమ మార్గంలో యువతకు, వ్యసనపరులకు అందుబాటులోకి వచ్చి ప్రతి గల్లీల్లో లభిస్తున్నాయని అన్నారు.

ఈ పరిస్థితి ఇలాగే ఉంటే సమాజంలో నేరాలు పెరిగి సామాజికంగా అభద్రత ఏర్పడుతుందన్నారు.మత్తులో ఎలాంటి నేరాలు చేయడానికైనా దిగజారుతారని తెలిపారు.

ఇలాంటి డ్రగ్స్ ను రూపుమాపే దిశగా యువతలో,పౌరుల్లో సామాజిక బాధ్యత పెరగాలని కోరారు.శిక్షణలో ఉన్న అభ్యర్థులు పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి డ్రగ్స్ నివారణకు సైనికుల్లా పని చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగభూషణం,రూరల్ సిఐ విఠల్ రెడ్డి,పట్టణ సిఐ ఆంజనేయులు,ఎస్బిఇన్స్పెక్టర్ శ్రీనివాస్,శిక్షణ ఇంచార్జీ సిఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఐలు గోవిందరావు,నర్సింహారావు,ఆర్ఎస్ఐ సాయి,సిబ్బంది,శిక్షణ యువత పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube