నితిన్ కూడా డేట్ మార్చేశాడు..!

లవర్ బోయ్ నితిన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం.రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో నితిన్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

 Nitin Macharla Niyojakavargam Release Postponed, Krithi Shetty, Macharlla Niyoja-TeluguStop.com

సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. విలేజ్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో నితిన్ ఈ సినిమాతో మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.

సినిమాలో నితిన్ యాక్షన్ సీన్స్ అదరగొడతాడని అంటున్నారు.సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఇదిలాఉంటే జూలై 8న రిలీజ్ అనుకున్న ఈ సినిమా వాయిదా పడ్డది.నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాని ఆగష్టు 12కి వాయిదా వేశారు.జూలై నెలలో వరుస సినిమాలు ఉన్నాయన్న కారణంలో లేక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కి కొంత టైం పడుతుందనో కాని నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాని మరో నెల వాయిదా వేశారు.రంగ్ దే, మాస్ట్రో సినిమాల తర్వాత నితిన్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత నితిన్ వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఈ మూవీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube