2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోడీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.నాటి అల్లర్లపై నియమించిన నానావతి కమిషన్ నివేదిక సరైందేనని తీర్పు చెప్పింది.
కమిషన్ నివేదికపై వేసిన పిటీషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.అల్లర్లతో మోడీ, మరో 63 మందికి సంబంధం లేదంటూ కమిషన్ ఇచ్చిన నివేదికను అల్లర్లలో చనిపోయిన మాజీ కాంగ్రెస్ ఎంపీ భార్య సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
పోలీసుల వైఫల్యం వల్లనే అల్లర్లను అరికట్టలేకపోయారని, ఇందులో అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని కమిషన్ స్పష్టం చేసింది.గోధ్రాలో సబర్మతీ రైలు దహనం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని తెలిపింది.
అదే సమయంలో గుజరాత్ లో చెలరేగిన అల్లర్లకు ఎలాంటి ప్లాన్ లేదని, జనం ఉద్రేకంతో రెచ్చిపోయారని కమిషన్ వివరించింది.పోలీసుల దగ్గర ఆధునిక ఆయుధాలు లేనందున అల్లర్లను అరికట్టలేకపోయారని తెలిపింది.
నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 ఫిబ్రవరి 27న గోధ్రాలో సబర్మతీ రైలు దహనం చేశారు.ఇందులో 59 మంది హిందూ కరసేవకులు సజీవంగా దహనమయ్యారు.
ఆ వెంటనే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి.మూడు రోజుల వ్యవధిలో వెయ్యి మందికి పైగా ప్రజలు అల్లర్లకు బలయ్యారు.
అల్లర్లపై వెంటనే స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ ను మోడీ నియమించారు.అలాగే న్యాయ విచారణకు కూడా ఆదేశించారు.
సుప్రీం కోర్టు రిటైర్లు జడ్జి నానావతి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి షా ఆధ్వర్యంలో విచారణ జరిగింది.ఆరేళ్ళ పాటు విచారణ నిర్వహించిన నానావతి కమిషన్ 2008లో ముఖ్యమంత్రి మోడీకి ప్రాధమిక నివేదిక సమర్పించింది.2014 నవంబర్ లో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ కు 1500 పేజీలతో పూర్తి నివేదికను అందించారు నానావతి.

అల్లర్లలో కొందరు ఆరోపించినట్లుగా ముఖ్యమంత్రి మోడీ, అప్పటి మంత్రులతో 63 మందికి ఎటువంటి సంబంధం లేదని నానావతి కమిషన్ తన నివేదికలో స్పషం చేసింది.ఈ నివేదికనే అల్లర్లో చనిపోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్రాన్ జాఫ్రీ భార్య సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.మరోవైపు అల్లర్లపై నియమించిన ప్రత్యేక కోర్టు 2011లో 11 మంది దోషులకు మరణ దండన విధించింది.
మరో 20 మందికి యావజ్జీవ శిక్ష విధించింది.అయితే 2017లో గుజరాత్ హైకోర్టు 11 మంది మరణశిక్షను కూడా యావజ్జీవ శిక్షగా మార్చింది.
అల్లర్లు జరగడంతో ముఖ్యమంత్రి మోడీ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయి.అమెరికా వంటి దేశాలు మోడీ వీసాను రద్దు చేశాయి.అయితే 2002 ఆఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోనే మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.2014 మేలో ప్రధాని అయ్యేవరకు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.







