శృతి హాసన్ చేతిపై రోజ్ పచ్చబొట్టు.. దాని వెనుక ఉన్న పరమార్థం ఇదేనాట!

భారత నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Rose Tattoo On Shruti Haasan Hand That The Reason Behind It , Shruti Haasan, Tol-TeluguStop.com

నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.తనకున్న క్రేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

Telugu Rose Tattoo, Shruti Haasan, Telugu, Tollywood-Movie

ఇక ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.

తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.

Telugu Rose Tattoo, Shruti Haasan, Telugu, Tollywood-Movie

అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.పబ్లిక్ ప్లేస్ లలో రొమాన్స్ లు చేస్తూ రెచ్చిపోతుంది.

ఇక గతంలో తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటుంది అని వార్తలు వినిపించగా మళ్లీ ఇప్పటి వరకు ఆ విషయం గురించి టాపిక్ కూడా రాలేదు.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విషయాలను, వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

Telugu Rose Tattoo, Shruti Haasan, Telugu, Tollywood-Movie

అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో సమయం దొరికినప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది.తాజాగా మరోసారి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.అందులో ఒక నెటిజన్ తన టాటూ గురించి అడుగగా అందులో తన చేతి కి ఉన్న టాటూ ఫోటో పంచుకొని.

ఆ టాటూ గురించి ఒక విషయం కూడా పంచుకుంది.ఆ టాటూ రోజ్ అని కానీ అది చూడటానికి క్యాబేజీ లా ఉంటుంది అని ఎందుకంటే దానికి ప్రేమ కావాలి కాబట్టి అలా కనిపిస్తుంది అని తెలిపింది.

ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube