సాయి పల్లవి మరియు రానా నటించిన విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద వెలవెల బోయింది.సినిమా కు మొదటి నుండి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది.
సినిమా విడుదల అయిన తర్వాత కూడా పాజిటివ్ రివ్యూలు మరియు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కాని సినిమా వసూళ్లు మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విరాటపర్వం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా ఈజీగానే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు.కాని అనూహ్యంగా విరాటపర్వం కు మంచి టాక్ వచ్చింది.
హిట్ టాక్ వచ్చింది.అయినా కూడా వసూళ్లు ఏమాత్రం నమోదు అవ్వడం లేదు.
వసూళ్ల విషయంలో తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యుల నుండి అనధికారికంగా ఒక క్లారిటీ వచ్చింది.
సినిమాకు ఇప్పటి వరకు అయిదు కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి అని.సినిమా కు తాము అనుకున్నట్లుగా వసూళ్లు రావడం లేదు అంటూ వారు చెప్పుకొచ్చారు.అయితే సినిమా కు టాక్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉందంటూ చెప్పుకొచ్చారు.
మొత్తానికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విరాటపర్వం సినిమా కు వసూళ్లు మాత్రం రావడం లేదు.ఇక వసూళ్లు రాకున్నా కూడా ఈ ఏడాది లో ఖచ్చితంగా పలు అవార్డు లను మరియు రివార్డులను విరాటపర్వం దక్కించుకునే అవకాశం ఉంది.
సాయి పల్లవికి హీరోయిన్ గా ఉత్తమ హీరోయిన్ అవార్డు దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా లోని ప్రతి ఒక్క నటీ నటులు కూడా అద్బుతంగా నటించారు అంటూ ప్రశంసలు దక్కాయి.
కాని ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లడం లేదు.ఇదెక్కడి వింత పరిస్థితి అంటూ యూనిట్ సభ్యులు చిత్రంగా చూస్తున్నారు.
సినిమా కు కనీసం పది కోట్ల మేరకు నష్టం వాటిల్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.







