ఆలోచించి అన్నారో.ఆవేశంగా అన్నారు తెలియదు గానీ రాబోయే ఎన్నికల్లో ప్రజలతోనే తాను పొత్తు పెట్టుకోబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అసలు ఏ దైర్యంతో పవన్ ఎన్నికలకు వెళ్దాం అనుకుంటున్నారు ? అసలు అందుకు కారణాలేమిటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ గా మారింది.అయితే ఇదంతా టిడిపి నాయకుల వ్యవహార శైలి కారణంగానే అనేది మాత్రం వాస్తవం.
మొదటి నుంచి టిడిపితో కలిసి వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారు .రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తాము అనే లెక్కల్లో ఉన్నారు.కానీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరక పోవడానికి ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలనే విషయంలో సందిగ్ధం ఏర్పడడమే కారణం.తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పార్టీతోనే పొత్తు పెట్టుకుంటామని , ముఖ్యమంత్రి పదవి తప్ప మరే ఆప్షన్ ఒప్పుకునేది లేదని పవన్ క్లారిటీ ఇచ్చేయడంతో టిడిపి ఆలోచనలో పడింది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా వేరొకరిని ముఖ్యమంత్రి చేసేందుకు తాము ఒప్పుకోమని టిడిపి నాయకులు ప్రకటనలు చేయడం పవన్ కు ఆగ్రహం కలిగించింది.
అంతకుముందు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో జనసేన తో పొత్తు అంశంపై స్పందించారు వన్ సైడ్ లవ్ అంటూ జనసేన తో పొత్తుల వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
తర్వాత దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం తనకు ఇష్టం లేదని, వైసీపీ ప్రత్యర్థి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.దీంతో టిడిపి ఆశలు చిగురించాయి.
రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు అవుతుందని అంతా అంచనా వేసిన సమయంలో సీఎం కుర్చీ విషయంలో ఏకాభిప్రాయం కుదరాకపోవడం మాత్రమే కాకుండా, ఇటీవల టిడిపి నిర్వహించిన మహానాడు కార్యక్రమం భారీగా సక్సెస్ కావడం, గతంతో పోలిస్తే టిడిపి బాగా బలం పుంజుకుందనే సర్వే నివేదికలు అందడంతో జనసేన తో పొత్తు పెట్టుకుని భారీ స్థాయిలో సీట్లు ఆ పార్టీకి ఇవ్వడం కరెక్ట్ అని కాదు అనే అభిప్రాయానికి వచ్చిన బాబు సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేసి గెలుద్దాం అంటూ బాబుతో పాటు ఆ పార్టీ నాయకులు స్టేట్మెంట్లు వంటివి ఇచ్చారు.

ఆ తర్వాత పవన్ మూడు ఆప్షన్లను తెరపైకి తెచ్చారు.ఈ ఆప్షన్ లపై బీజేపీ, టీడీపీలు కూడా పవన్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.అసలు పవన్ కు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అంత స్థాయి ఉందా ? అనే విధంగా స్టేట్మెంట్లు జనసేన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.ఈ వ్యవహారం పైన ఆగ్రహం చెందిన పవన్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని ప్రకటనలు చేశారు.ఈ ప్రకటన టిడిపి కోసం చేసింది అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి కానీ, జనసేన కానీ ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు.కానీ ఖచ్చితంగా టిడిపి తమతో పొత్తు పెట్టుకుంటుందని పవన్ అభిప్రాయపడుతున్నారు.
కానీ తమకు సీట్లను తక్కువ సంఖ్యలో కేటాయించకుండా వీలైనన్ని ఎక్కువ సీట్లు కేటాయించడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి విషయంలో టిడిపి తమ డిమాండ్లకు తలొగ్గుతుంది అనే అంచనాలో పవన్ ఉన్నారట
.







