ఆ మేక చెవులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అంత పొడవు చెవులు ఎపుడూ చూసుండరు!

మనలో ఎవరికన్నా చెవులు సాధారణ సైజు కంటే కాస్త ఎక్కువగా ఉంటే ‘బడా చెవులు’ ‘చేట చెవులు’ అని ఏడిపించడం మన చిన్నపుడు మనం చూసాం.ఇక మన మనుషులకు మల్లే శరీర పరిణామాన్ని బట్టి జంతువులలో కూడా చెవులు సరిపడే సైజులలో ఉంటాయి.

 Baby Goat Simba Born With 19 Inches Long Ears Details, Goat, Viral Letest, News-TeluguStop.com

ఎలుక నుండి ఏనుగు వరకు చెవులు వాటి వాటి శరీర ఆకృతులను బట్టే నిర్మించబడి ఉంటాయి.అయితే జంతువులలో కూడా చాలా రేర్ గా చెవులు పెద్దవిగా కనిపించం గురించి కొన్ని జియోగ్రఫీ ఛానెల్స్ లలో మీరు చూసే వుంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటన ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది.

బేసిగ్గా మేకలకు (goat) మనుషులకు మల్లే సాధారణ పరిమాణంలోనే చెవులు అమర్చబడి ఉంటాయి.

అయితే వీటిలో కూడా చాలా రేర్ కేసెస్ లో చెవులు బాగా పొడవుగా కనిపిస్తాయి.అయితే ఇపుడు మాట్లాడుకోబోయే మేక చెవులు మాత్రం చాలా తీవ్రమైన పొడవుని కలిగి వుంటాయని చెప్పుకోవాలేమో.

ఎందుకంటే సదరు మేక చెవుల సైజు తెలిస్తే మీకు గుండాగిపోలసిందే.అవును.ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న మేకకు 19 అంగుళాల పొడవైన చెవులు కలవు.పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన దీనికి ‘సింబా’ అని పేరుపెట్టారు.

Telugu Baby Goat, Baby Goat Simba, Goat, Goatinches, Guinness, Mohammad Hasan, S

19 అంగుళాల పొడవున్న చెవులతో ఈ మేక పిల్ల త్వరలో గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కబోతోందని దాని యజమాని అయినటువంటి మహమ్మద్‌ హాసన్‌ గర్వంగా చెప్తున్నాడు.అయితే మహమ్మద్ దాని ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.సాధారణంగా నుబియన్‌ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయని, కానీ ‘సింబా’ చెవులు మాత్రం మరీ ఎక్కువ పొడవుని కలిగి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.ఈ మేక పిల్లలో జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్‌ సమస్యగానీ దీనికి కారణం కావొచ్చని కూడా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube