జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏమైపోతానే చిత్రం

సినిమా పరిశ్రమలో ఎన్నో రకాల జోనర్ లలో సినిమాలు వచ్చినా ప్రేమకథా జోనర్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది.ప్రేక్షకులలో మంచి ఫీలింగ్ ని కలిగించే ఈ సినిమాలు మంచి హిట్స్ అవుతూ ఉంటాయి కూడా.

 A Different Love Saga Yemaipothaney Releasing Grandly On 1st July Yemaipothaney-TeluguStop.com

అలా ఫీల్ గుడ్ ప్రేమకథగా తెరకెక్కిన సినిమా ఏమైపోతానేఅమర్ లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా లో విజయ్ రామ్, జె.నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది.సురేష్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా కి వసంత్.

జి సంగీతం సమకూర్చారు.కె.వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా శివ శార్వాణి ఎడిటింగ్ అందించారు.కాగా ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్ కుసిరెడ్డి మాట్లాడుతూ.ప్రేమకథా సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను.పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది.ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది.ఈ సినిమా లో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు.జులై 1 న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది.అన్నారు.

నటీనటులు

అమర్ లతు, చాందిని పౌర్ణమి, విజయ్ రామ్, జె.నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు

సాంకేతిక నిపుణులు

నిర్మాత – సురేష్ కుమార్ కుసిరెడ్డి రచన, దర్శకత్వం – సురేష్ కుమార్ కుసిరెడ్డి మ్యూజిక్ – వసంత్.జి సినిమాటోగ్రఫీ – కే .వెంకటేష్ ఎడిటర్ – శివ శార్వాణి కో – డైరెక్టర్ – నాని బాబు డిఐ – ఆర్యన్ మౌళి (ఆర్ట్ కలర్ ల్యాబ్) మిక్సింగ్ – విష్ణు (కార్తికేయ స్టూడియో) పి.ఆర్‌.

ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube