టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఇతర భాషల హీరోయిన్లు ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుందనే సంగతి తెలిసిందే.
తెలుగులో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కృతిశెట్టి, రష్మిక మందన్నా కన్నడ హీరోయిన్లు కావడం గమనార్హం.కృతిశెట్టి వరుసగా మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
మరో నాలుగు సినిమాలు కృతిశెట్టి చేతిలో ఉన్నాయి.ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే కృతిశెట్టి రేంజ్ మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్డే సైతం కన్నడ హీరోయిన్ కావడం గమనార్హం.పూజా హెగ్డే తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో నటిస్తున్నారు.
పూజా హెగ్డే ప్రస్తుతం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.
కన్నడ హీరోయిన్ అయిన సౌందర్య కొన్నేళ్ల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారనే సంగతి తెలిసిందే.

మరో కన్నడ నటి ప్రేమ తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.బాపు బొమ్మ ప్రణీత సైతం తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లను అందుకున్నారనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ప్రణీత సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సక్సెస్ లను సొంతం చేసుకున్న అనుష్క కూడా కన్నడ బ్యూటీ కావడం గమనార్హం.కన్నడ బ్యూటీ రక్షిత తెలుగులో పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.మరో కన్నడ హీరోయిన్ నభా నటేష్ కూడా తెలుగులో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు.







