దసరా తర్వాత బ్రేక్ తీసుకోనున్న నాని..!

నాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు.శ్యామ్ సింగ రాయ్ పూర్తి కాగానే అంటే సుందరానికీ షురూ చేశాడు.

 Nani Taking Long Break After Dasara Movie , Dasara , Nani , Nani Dasara , Nani-TeluguStop.com

అది రిలీజ్ అవకుండానే దసరా మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.దసరా సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో చేస్తున్నాడు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలంగాణా బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ మూవీగా దసరా మూవీ వస్తుంది.

సినిమా తర్వాత నాని కొద్దిగా గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట.దాదాపు పది సినిమాల నుండి ఒకటి రిలీజ్ కాగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమా చేస్తూ వచ్చాడు నాని.

ఇక ఇప్పుడు దసరా సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తాడని తెలుస్తుంది.దసరా సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది.

దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.మాములుగా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ఓకే చేసే నాని దసరా సినిమా తర్వాత ఏ సినిమా అన్నది ఇంకా నిర్ణయించలేదు.

డైరక్టర్ ఎవరన్నది కూడా ఇంకా ఫైనల్ అవలేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube