కుర్చీ వేసుకుని మరీ అభివృద్ధి చేస్తానని అక్కడి ప్రజలకు ప్రామిస్ చేసిన గులాబీ బాస్, ఇక మాట నిలుపుకునే సమయం ఆసన్నమైందా ? ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతున్నట్టేనా ? ఆ నియోజకవర్గంపై బాస్ ఫోకస్…ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికేనా ? వరుస పర్యటనలు ముందస్తు ఎన్నికల్లో భాగమేనా ? మరి పెద్దాయన నజర్ పెట్టిన నియోజకవర్గమేంటనుకుంటున్నారా ?
నల్గొండ నియోజకవర్గం నాడు కమ్యూనిస్టులకు ఆ తర్వాత కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది.కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పొలిటికల్ లైఫ్ ఇచ్చిన సెగ్మెంట్ ఇదే.
వరుసగా నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా,ఓ సారి మంత్రిగా పనిచేశారు కోమటిరెడ్డి.కానీ 2018 ఎన్నికల్లో మాత్రం కారు జోరులో కోమటిరెడ్డి హవాకు బ్రేక్ పడింది.
అప్పటిదాకా నల్గొండ నియోజకవర్గంలో ఏకచక్రాదిపత్యం సాగించిన కోమటిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడారు.దానికి కారణం భూపాల్ రెడ్డిపై ఉన్న సానుభూతి ఒకటైతే,గులాబీ దళపతి ఇచ్చిన హామీలు మరో ప్రధాన కారణం.

2018ఎన్నికల సందర్భంగా ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కేసీఆర్.కోమటిరెడ్డి పాతుకు పోయిన పునాదులు కదిలించాలంటే…అభివృద్ధి మంత్రమే సరైన ఎత్తుగడగా భావించారు బాస్.అందుకే అప్పట్లో ప్రజలకు వరాల జల్లు కురిపించారు.కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్గొండలో కుర్చీ వేసుకుని మరీ అభివృద్ధి చేస్తానని ప్రజలకు ప్రామిస్ చేశారు.దాంతో కేసీఆర్ కామెంట్స్ కు ఇంపాక్ట్ అయిన పబ్లిక్ ,నల్గొండలో పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు.కానీ అభివృద్ధి మాట మూడేళ్లపాటు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండేది.
సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు సెటైర్లతో విరుచుకుపడ్డాయి.కుర్చి వేసుకుని మరీ అభివృద్ధి చేస్తానన్న పెద్దాయన కు కుర్చీ దొరకడం లేదా అంటూ ఎద్దేవా చేయడం మొదలెట్టారు ప్రత్యర్దులు.
తాజాగా విమర్శలు చేసినోళ్ళ నోటికి తాళం వేసి….తనదైన దూకుడుతో ముందుకెళుతోంది గులాబీ బాస్ టీమ్.

వాస్తవానికి నల్గొండ నియోజకవర్గం పేరుకే జిల్లా కేంద్రం అయినప్పటికీ రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ అస్త్యవ్యస్థ౦గా ఉండేది.సహజంగా ఏ ప్రాంతమయిన అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి.సరిగ్గా ఇదే ఫార్మూలాతో బాస్ ముందుకెళుతున్నారట.ఇప్పటికే నల్గొండ పట్టణం చుట్టూ….విశాలమైన రోడ్ల నిర్మాణంతో కలే మారింది.పట్టణానికి మరింత అందాన్ని తెచ్చి పెట్టే మినీ ట్యా౦క్ బ౦డ్,అందమైన పార్కులు,రోడ్ల విస్తరణతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం.
ఓ విదంగా చెప్పాలంటే గజ్వేల్,సిద్దిపేట తరహాలో పట్టణం ముస్తాబవుతోందనే భావనలో ప్రజలున్నారట.అయితే ఇదంతా ఇక ఎత్తైతే….
అభివృద్ధి మంత్రంలో రాజకీయ వ్యూహం కూడా దాగుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఓ అంచనాకొచ్చారట.







