రాజకీయ నాయకుడి మాదిరిగా ఈ హామీలు ఏంటి చిరంజీవి గారు?

మెగాస్టార్‌ చిరంజీవి ఈమద్య మరీ భోళా గా మారిపోతున్నారు.భోళా అంటే ఎక్కడకు వెళ్తే అక్కడ తన పరిధిలో ఉన్నా లేకున్నా కూడా హామీలు ఇవ్వడం.

 Megastar Chiranjeevi Offer To Aha Ott Indian Idol Telugu Winner , Aha Ott , Chi-TeluguStop.com

ఆ మద్య బిగ్ బాస్ గ్రాండ్‌ పినాలే ఎపిసోడ్‌ కు వెళ్లి చాలా మందికి తన సినిమాల్లో ఆఫర్లు ఇస్తాను అంటూ ప్రకటించాడు.అంతే కాకుండా మీకు నేను ఉన్నాను అన్నట్లుగా హామీ ఇచ్చాడు.

ఆ తర్వాత తన హామీలను ఎంత వరకు చిరంజీవి నెవరేర్చాడు అనే విషయం లో క్లారిటీ లేదు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో కూడా చిరంజీవి పాల్గొన్నాడు.

ఆ సందర్బంగా చిరంజీవి విజేతగా నిలిచిన అమ్మాయికి బంపర్ ఆఫర్‌ ప్రకటించాడు.తన సినిమా లో పాడే అవకాశం ఇవ్వడం తో పాటు మరింతగా తన నుండి ప్రోత్సాహం ఉంటుంది అంటూ హామీ ఇచ్చాడు.

మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ఒక రాజకీయ నాయకుడి మాదిరిగా చాలా ఆఫర్లు ఇస్తున్నాడు.హామీ ఇస్తున్నాడు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.ఇలా హామీలు ఇచ్చి నెరవేర్చకుంటే విమర్శలు వస్తాయి.ఆ విషయాన్ని చిరంజీవి ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.కనుక సినిమా లతో చాలా బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన చేతిలో గాడ్‌ ఫాదర్‌ సినిమా తో పాటు భోళా శంకర్ మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి.ఇవి కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా ను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

మొత్తానికి చిరంజీవి ఫుల్‌ బిజీగా ఉండి.అప్పుడప్పుడు ఈ సినిమా కార్యక్రమాలకు వెళ్తూ తన మంచితనంను చాటుకునేందుకు హామీలు ఇస్తూ ఉన్నాడు.

చిరు హామీలకు కొందరు హ్యాపీ అయితే మరికొందరు కోపం  గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube