పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరానందన్ అందరికీ ఎంతో సుపరిచితమే.పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోవడంతో అకీరా తల్లి దగ్గరే ఉంటున్నారు.అయితే మెగా కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ అకీరానందన్ సందడి చేస్తారు.
ఇక ఇప్పటికే ఇండస్ట్రీలోకి మెగా వారసులు ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే మెగా అభిమానులు అకీరా ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే అకీరా ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ పెద్దఎత్తున వార్తలు షికార్లు చేసినప్పటికీ అకీరా ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు మాత్రం కనబడటం లేదు.నటనపై అకీరాకు పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ సంగీతం అంటే తనకు చాలా ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం RRR సినిమాలో దోస్తీ అనే పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.తాజాగా అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలో పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

మేజర్ సినిమాలోని హృదయమా అంటూ సాగే .పాటను కీ బోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఇక ఈ వీడియోను అడివి శేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిన్న నోట్ రాశారు.ఈ పాటను కంపోజ్ చేసి పంపినందుకు అకీరాకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన పవర్ స్టార్ అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇక వ్యక్తిగతంగా అడివి శేష్, అకీరా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.







