జలియన్ వాలాబాగ్ ఘటనను సిగ్గుమాలిన సంఘటనగా అభివర్ణించారు భారత్‌లోని బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ జులియన్.బుధవారం అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ స్మారక స్థలాన్ని అలెక్స్ సందర్శించి.అమరవీరులకు నివాళులర్పించారు.1919, ఏప్రిల్ 13న జరిగిన ఘటనను ‘‘చీకటి రోజు’’గా అలెక్స్ అభివర్ణించారు.ఈ మేరకు జలియన్ వాలాబాగ్ విజిటర్స్ బుక్‌లో ఆయన ఇలా వ్రాశారు.‘‘జలియన్ వాలాబాగ్‌లో జరిగినది సిగ్గుచేటు.దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నాము, ఇది ఎన్నటికీ మరచిపోలేము’’ అన్నారు.అనంతరం డిప్యూటీ హైకమీషనర్ కరోలిన్ రోవెట్‌తో కలిసి ఆయన ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌జీపీసీ చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి వారికి ఘన స్వాగతం పలికి.సిక్కు సంప్రదాయాలను తెలియజేశారు.
కాగా.భారత స్వాతంత్ర పోరాట చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది.నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు.
జలియన్ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలోని ఓ తోట.వైశాఖీ పర్వదినం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు.అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమరయోధులు సైతం పాల్గొన్నారు.

ఈ విషయం తెలుసుకున్న జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం జలియన్ వాలాబాగ్‌లోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.50 మంది సైనికులు పది నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు.తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రవేశ మార్గాలను మూసివేసి.
జనంపై తూటాల వర్షం కురిపించారు.ఈ ఘటనలో 379 మంది మరణించారని బ్రిటీష్ ప్రభుత్వం చెప్పినప్పటికీ.1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు.ఇంతటి మారణహోమానికి కారణమైన జనరల్ డయ్యర్‌పై పగబట్టిన సర్దార్ ఉదమ్ సింగ్.
ఆయనను కొన్నేళ్లపాటు వెంటాడి లండన్‌లో కాల్చిచంపారు.ఈ నేరానికి గాను ఉదమ్ సింగ్‌ను బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది.







