పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నారు.అభిమానం ఉన్న వారే మరింత బాధించారు.
సమయం దొరికితే వైసీపీ నేతలు పవన్ సినిమాలపై.వ్యక్తి గత విషయాలపై ముగ్గురు మాజీ మంత్రులు అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు.
ప్రస్తుతం విశాఖ జిల్లాకు చెందిన ఓ యువ మంత్రి సెటైర్లు వేస్తున్నాడు.అయితే ఇతనికి త్వరలోనే మూల్యం చెల్లించాలని జనసేన సేనికులు ఫిక్స్ అయ్యారు.
తొలివిడత మంత్రి వర్గంలో నలుగురు మంత్రులు పవన్ ని వ్యక్తిగత విషయాల్లో విమర్శిస్తూ ప్రస్తుతం మాజీలయ్యారు.ఇక మలి విడత మంత్రి వర్గంలో మంత్రి గుడివాడ అమరనాథ్ ఆ బాధ్యత తీసుకున్నట్లు అనిపిస్తోంది.
పవన్ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తూ జనసైనికులకు కోపం తెప్పిస్తున్నాడు.
అయితే తాజా మాజీ మంత్రులు పేర్ని నాని చిరంజీవి కుటుంబానికి దగ్గరి సన్నిహితుడు.
అయినప్పటికీ పవన్ పై గట్టిగానే కౌంటర్లు వేసేవారు.అలాగే పవన్ కల్యాణ్ కి వీర అభిమానిగా చెప్పుకున్న అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేశాడు.
అలాగే ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన కన్నబాబు కూడా ఇదే పనిగా పెట్టుకున్నాడు.అలాగే కొడాలి నాని బూతులతో పవన్ పై రెచ్చిపోయాడు.
అయితే ప్రస్తుతం వీళ్లు మాజీ మంత్రులు అనుకోండి అది వేరే విషయం.అయితే వీళ్ల తరఫున ప్రస్తుతం ఆ బాధ్యతలు మలి విడతలో మంత్రి పదవి దక్కించుకున్న గుడివాడ అమరనాథ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక అమరనాథ్ పవన్ తోని బాగానే వెటకారం ఆడేస్తున్నాడు.దీంతో జనసైనికులు రగిలిపోతున్నారు.ఆ మధ్య విశాఖ విమానాశ్రయంలో పవన్ తనతోనే సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపాడని చేసిన కామెంట్స్ జన సైనికులకు కాలేలా చేశాయి.అంతటితో ఆగకుండా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మరింత టార్గెట్ అయ్యాడు.
ఇక రీసెంట్ గా పవన్ తమ పార్టీకి మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పుకుంటే.పవన్ కి మూడు.
మీద మోజు పోవడంలేదు అంటూ ఇండైరెక్ట్ గా మూడు పెళ్లిళ్లపై సెటైర్లు వేశాడు.దీంతో గెలికి మరీ కయ్యం పెట్టుకుంటున్నాడని జనసైనికులు మండిపోతున్నారు.
పవన్ సైతం గుడివాడపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.ఇక వచ్చే ఎన్నికల్లో మాజీని చేయాలని బలంగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అనకాపల్లిలో నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్ల తేడాతో టీడీపీపై గెలిచిన గుడివాడకు ఈ సారి ఆ చాన్స్ ఇవ్వొద్దని పావులు కదుపుతున్నట్లు సమాచారం.అయతే ఆ ఎన్నికల్లో జనసేనకు దాదాపుగా పన్నెండు వేల దాకా ఓట్లు వచ్చాయి.దాంతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు కనుక కుదిరితే గుడివాడ ఓడిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు.ఒంటరిగా పోటీ చేసినా మంత్రికి మాజీ గిఫ్ట్ ఇవ్వడం మరచిపోమని కౌంటర్ ఇస్తున్నారు జనసైనికులు.







