టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవికి అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది అంటే అందుకు గల కారణం అతని మామ అల్లు రామలింగయ్య అని చెబుతూ ఉంటారు.అయితే టాలెంట్ ఉండటం ఒక గొప్ప అయితే ఆ టాలెంట్ కి తగిన గుర్తింపు దక్కితేనే స్టార్లు అయ్యేది అని అంటూ ఉంటారు.
ఇక చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చిరు అల్లు టాలెంట్‌ను రామలింగయ్య గుర్తించడం వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీకు మెగాస్టార్ వరంలా దొరికారు అని చెప్పవచ్చు.టాలెంట్ చూసి ప్రోత్సహిచడం సాధారణమైన విషయమే అయినప్పటికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య.
ఆ తరువాత మామ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టాలీవుడ్‌ని ఏలేశారు చిరు.
కాగా నిజానికి సురేఖతో పెళ్లయ్యేసరికి చిరంజీవి హీరోగా సరైన గుర్తింపు కూడా లేదు.
కానీ అప్పటికే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్.అంతే కాకుండా సొంత నిర్మాణంలో సినిమాలు కూడా చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో తన కూతురు సురేఖకి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నా కూడా అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య.అయితే ఈ అనూహ్య నిర్ణయం వెనుక తనకి అత్యంత సన్నిహితుడు పాపులర్ నటుడు అయిన ప్రభాకర్ రెడ్డి సలహాతోనే చిరంజీవి సురేఖల వివాహం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త.

చాలా ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి భార్య సంయుక్త తనకు అల్లు రామలింగయ్య కుటుంబం తో ఉన్న అనుబంధం గురించి తెలిపింది.ఈ క్రమంలోనేచిరంజీవి, సురేఖల పెళ్లి గురించి మాట్లాడుతూ.ఆ విషయంలో తన తన భర్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటల్ని గుర్తు చేసుకుంది సంయుక్త.సురేఖ,చిరంజీవి పెళ్లి కోసం వాళ్ళు కాశ్మీర్ కు వెళ్లారట.అక్కడ దాదాపుగా 15 రోజులు ఉన్నారట.ఇక చిరంజీవి అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్న టైంలో అల్లు రామలింగయ్య మా ఫ్యామిలీకి బాగా క్లోజ్.
సురేఖ పెళ్లి కోసం రెడ్డిగారితో చర్చించారు.నువ్ చెప్పు రెడ్డి బాబు సురేఖకి కలెక్టర్ సంబంధం రెడీగా ఉంది.
చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటానని అన్నాడు.ఈ ఇద్దరిలో ఎవరికిచ్చి పెళ్లి చేయమంటావ్.చిరంజీవా? కలెక్టరా? నువ్ చెప్పు అని అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డిగారిని అడిగగా పిల్లలకు అన్నీ మనం ఇస్తాం.ఇప్పుడు కలెక్టర్ సంబంధం కూడా మంచిదే.
కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్లని ఇచ్చి పెళ్లి చేయండి అని ప్రభాకర్ రెడ్డిగారు చెప్పారట.
సురేఖ చిరంజీవిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అలా వాళ్ల పెళ్లి అయ్యింది అని చెప్పుకొచ్చింది సంయుక్త.








