ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ సినిమాలకు హిట్ టాక్ వస్తే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
కొన్ని సినిమాలు గతంలో క్రియేట్ అయిన రికార్డులను సైతం సులువుగా బ్రేక్ చేస్తున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు భారీగా కలెక్షన్లను సాధిస్తున్నాయి.
సౌత్ లో బాలీవుడ్ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.బాహుబలి ది బిగినింగ్ సినిమా నుంచి హిందీలో సౌత్ సినిమాల హవా మొదలైంది.
కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2, బాహుబలి2, పుష్ప ది రైజ్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు బాలీవుడ్ లో అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సూర్యవంశీ, భూల్ భూలయ్యా2 సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి.
భారీ అంచనాలతో తాజాగా విడుదలైన భూల్ భూలయ్యా2 సినిమా సైతం బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేదనే సంగతి తెలిసిందే.

సౌత్ సినిమాలు 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుంటే హిందీ సినిమాలు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ 100 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సొంతం చేసుకోలేదు.

బచ్చన్ పాండే సినిమాకు సైతం హిందీలో భారీస్థాయిలో నష్టాలు వచ్చాయి.బాలీవుడ్ దర్శకనిర్మాతలు కథపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ ఫలితాలు ఎదురవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సౌత్ డబ్బింగ్ సినిమాలు కూడా హిందీలో మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.
ఈ సినిమాల ద్వారా సౌత్ హీరోలు బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.







