ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.
యశ్ తో ప్రశాంత్ నీల్ ఊహించని ఎలివేషన్ సన్నివేశాలు ఉన్న సినిమాను తెరకెక్కించడంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు.
కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరనే ప్రశ్నకు హృతిక్ రోషన్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ హృతిక్ రోషన్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.
అయితే ప్రశాంత్ నీల్ హృతిక్ ను కలవడానికి ప్రయత్నించగా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని సమాచారం.
కేజీఎఫ్ ఛాప్టర్1 కు ముందు ప్రశాంత్ నీల్ గురించి తెలియకపోవడంతో హృతిక్ ఆ సమయంలో ప్రశాంత్ నీల్ ను పట్టించుకోలేదు.

హృతిక్ రోషన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చాలామంది స్టార్ హీరోలు టాలెంటెడ్ డైరెక్టర్లకు కథ చెప్పే అవకాశం ఇవ్వకుండా ఇలాంటి మంచి సినిమాలను మిస్ అవుతున్నారు.

కేజీఎఫ్1, కేజీఎఫ్2 సక్సెస్ తో యశ్ రేంజ్ మాత్రం ఊహించని స్థాయిలో మారిపోయింది.యశ్ కొత్త ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.యశ్ తర్వాత ప్రాజెక్ట్ లు కన్నడతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానున్నాయి.ఈ సినిమాలతో యశ్ కు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.







