రానా దగ్గుబాటి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచి ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని హీరోగా విలన్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే తాజాగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీ ప్రేక్షకులను సందడి చేయనున్నారు.
ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు.అదేవిధంగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా బుధవారం సాయంత్రం ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా వస్తారని చెప్పినప్పటికీ పలు కారణాల వల్ల రామ్ చరణ్ హాజరుకాలేకపోయారు.
ఈ క్రమంలోనే వేదికపై రానా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ముందుగా ఈ కార్యక్రమానికి తన బాబాయ్ వెంకటేష్ ముఖ్యఅతిథిగా వచ్చినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపారు.బాబాయ్ లేకుండా తమ ఇంట్లో ఏ కార్యం కూడా జరగదని ఈ సందర్భంగా రానా తెలిపారు.
అదేవిధంగా రామ్ చరణ్ వస్తున్నారని చెప్పినప్పటికీ ఆయన రాకపోవడంతో రామ్ చరణ్ అభిమానులకు రానా క్షమాపణలు తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమా గురించి హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన రానా పలు షాకింగ్ కామెంట్ చేశారు.

ఇప్పటివరకు వెంకటేష్ గారికి ఉన్న ఫాన్స్ తనకు ఉన్నారని అనుకున్నాను.కానీ ఎప్పుడైతే విరాటపర్వం సినిమా చేయాలని అనుకున్నానో అప్పుడు తెలిసింది నాకు కూడా పెద్ద సంఖ్యలో ఫాన్స్ ఉన్నారని.నిజానికి ఈ సినిమా చేస్తున్న సమయంలో చాలామంది అభిమానులు ఈ సినిమాలో మీరు నటించద్దు అంటూ తనకు మెసేజ్ లు పెట్టారు.అప్పుడే నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారుని తెలిసి వచ్చింది.
ఇకపై ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయను.ఇదే నా చివరి చిత్రం.
ఇకపై చేసే సినిమాలన్ని మీకోసం (ఫాన్స్) చేస్తానని ఈ సందర్భంగా రానా ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.







