విరాటపర్వం రియల్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. సొంత అన్నలే దారుణంగా?

టాలీవుడ్ హీరో రానా, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం.ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Sai Pallavi Virata Parvam Toomu Sarala Brother Toomu Mohan Rao Reveals Virata Pa-TeluguStop.com

ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమా పదహారేళ్లకే నక్సలైట్ల చేతిలో హతమైన సరళ అనే అమ్మాయి జీవిత కథ ఆధారంగా రూపొందించారు.అయితే ఈ సరళ ఎవరు? ఆమె అంత చిన్న వయసులోనే నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ విషయాల గురించి తాజాగా చాలా అన్నయ్య అయినా తూము మోహనరావు బయటపెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈ సంఘటన 1991 లో జరిగింది.

సరళ అప్పుడు ఖమ్మం లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.ఒకరోజు సరళ కాలేజీకి వెళ్లి కనిపించకుండా పోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని చాలా వెతికాము.

ఇక చివరికి తన సైకిల్ పియుఎస్యు న్యూ డెమొక్రసీ ఆఫీస్ లో దొరికింది.ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వద్దని చెప్పినా కూడా పనిచేసేది అని తెలిపారు మోహన్ రావు.

అలా దాదాపుగా నెల రోజుల పాటు దొరకలేదు కానీ నెల రోజుల తర్వాత ఒక పత్రికలో పోలీస్ ఇన్ ఫార్మర్ సరళ డెడ్ అనే ఒక వార్తను చూసి షాక్ అయ్యాము.ఆ తర్వాత అసలు ఏం జరిగింది?అని ఎంక్వైరీ చేయగా అసలు విషయాలకు వెలుగులోకి వచ్చాయి అని తెలిపారు.

Telugu Mohan Rao, Rana, Sai Pallavi, Sarala, Tollywood, Virataparvam-Movie

అయితే మొదట్లో చాలా కనిపించక పోయినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు వచ్చాయి కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది అన్న భయంతో ఇవ్వలేదు.అలా మాకు ఆమె దగ్గరగా ఉంటే ఎవరికైనా కనబడుతుంది మళ్ళీ వెనక్కి తీసుకు వస్తాను అన్న భయంతో ఖమ్మం నుంచి దూరంగా నిజామాబాద్ కు వెళ్ళిపోయింది అని అనుకున్నాము అని తెలిపారు మోహన్ రావు.అతని ఊరు వరంగల్ లోనే భూపాలపల్లికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందట.అతని తండ్రికి నక్సలైట్లతో సంబంధాలు ఉండేవని, అందువల్లే తన చెల్లెలు అటువైపుగా ఆలోచించేది అని తెలిపారు మోహన్.

ఆమెను డాక్టర్ చేయాలని ఇంటర్లో బైపీసీ జాయిన్ చేసినప్పటికీ ఆమె చనిపోయే సరికి ఇంటర్ ఫస్టియర్ జస్ట్ 10 నెలలు మాత్రమే కాలేజీకి వెళ్లిందని పరీక్షలు కూడా రాయలేదని మార్చిలో ఎగ్జామ్స్ రాయాల్సి ఉండగా ఫిబ్రవరిలోనే చనిపోయింది అని తెలిపారు.ఆమె ఇంటర్ కీ జాయిన్ అయినప్పటికీ ఆమె దృష్టి అంతా కూడా ఉద్యమం వైపు ఉండేదని, అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా కుండలు బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేది అని తెలిపారు.

అలా వెతకగా చివరికి నెల రోజుల తర్వాత చనిపోయింది అని తెలిసింది.అయితే చాలా చనిపోయేవరకు అన్న దళం లో ఉన్నట్లు మాకు తెలియదు.దళంలో సరళ ఉంది అంటే వేరే సరళా ఏమో అనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని పిలిచి కన్ఫామ్ చేసిన చేసేవరకు కూడా మాకు తెలియదు అని తెలిపారు.అయితే ఆమె చనిపోయేముందు సింహ పల్లి గ్రామానికి వెళ్ళి అక్కడి దళం సభ్యులతో కలిసి పని చేయగా ఆ సమయంలో సరళ పై వాళ్లకు అనుమానాలు కలగడంతో, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదో మరి ఏమైందో తెలియదు కానీ పోలీస్ ఇన్ ఫార్మర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యి కొట్టి టార్చర్ చేసి చంపేసి అనంతరం దహనం చేసి పేపర్ కు స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారు అని చెప్పుకొచ్చారు మోహన్ రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube