తెలంగాణ ప్రభుత్వం ఆ బియ్యాన్ని ఏం చేసింది.పేదలకు పంచడానికి కేంద్రం ఇచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయలేదు? దాదాపు 2 లక్షల టన్నుల బియ్యం ఏమయ్యాయి? కేంద్ర పథకాన్ని రద్దు చేసి మరీ తీసుకున్న బియ్యాన్ని కేసీఆర్ సర్కార్ ఎక్కడకు మళ్ళించింది?
కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసింది.ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి పేదవాడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యాన్ని సరఫరా చేసింది.ప్రతి రాష్ట్రంలోనూ భారత ఆహార సంస్థ నుంచి ఆయా రాష్ట్ర్ర ప్రభుత్వాలు బియ్యాన్ని తీసుకుని తమ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేశాయి.
అయితే రాష్ట్రంలో కేంద్ర పథకాన్ని అమలుచేయబోమంటూ సస్పెండ్ చేసిన తర్వాత కేసీఆర్ సర్కార్ లక్షా 90 వేల టన్నుల బియ్యాన్ని FCI నుంచి తీసుకుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు.కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో సస్పెండ్ చేసినందున ఆ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయలేదని తెలిపారు.
గత ఏప్రిల్, మే నెలల్లోనే ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని వివరించారాయన.

కేంద్రం నుంచి బియ్యాన్ని తీసుకుని పేదలకు పంపిణీ చేయనందునే…ఇకపై తెలంగాణ నుంచి బియ్యం సేకరించబోమని FCI హెచ్చరించింది.కేసీఆర్ సర్కార్ తప్పుడు పనుల వల్ల రాష్ట్రంలోని రైతులు నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ విమర్శించారు.FCI నుంచి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు ఈ నెల 7న రాసిన లేఖలో మరిన్ని విషయాలు కూడా ప్రస్తావించింది.
రబీ పంటకు సంబంధించి 12 రైస్ మిల్లుల్లో 18,621 రైస్ బ్యాగ్ లు, 2020 -21 ఖరీఫ్ కు సంబంధించి 51 మిల్లుల్లో లక్షా 19 వేల 251 రైస్ బ్యాగ్ లకు సంబంధించి లెక్కలు లేవని కూడా FCI ప్రస్తావించింది.







